Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ మాటలకు వసుకి అనుమానం వస్తుంది. వెంటనే జగతి మేడం వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అని అంటుంది. దాంతో గౌతమ్ నాకెలా తెలుస్తుంది అని.. ఏదో మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు వస్తారేమో అన్నట్లుగా అన్నాను అని అంటాడు. ఇక వసు వాళ్ల కోసమే నేను మీడియా ఇంటర్వ్యూ ను పోస్ట్ పోన్ చేసుకున్నాను.. అలాంటిది పెళ్లి ఎలా చేసుకుంటాను అని అంటుంది.
ఈ గెలుపుకి కారణం జగతి మేడం.. ఆవిడ లేకుంటే నాకు ఇవన్నీ ఎందుకు అని అంటుంది. దాంతో గౌతమ్.. నువ్వు మీ మేడం కోసం, వాడు తన డాడ్ కోసం ఎన్నాళ్ళని ఎదురు చూస్తూ ఉంటారు అని అంటాడు. వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాము అని అంటుంది వసు. ఇక వసు అక్కడి నుంచి బయలుదేరుతూ.. జగతి మేడం వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే చెప్పండి అని అంటుంది.
దాంతో గౌతమ్ వసుకి నా మీద అనుమానం వచ్చినట్లుంది అని అనుకుంటాడు. ఇక రిషికి మీడియా వాళ్ళు ఫోన్ మేడం ఇంటర్వ్యూ వాయిదా వేశారు అని అనటంతో.. ఇంటర్వ్యూ జరుగుతుంది మిగతా విషయాల గురించి నేను చెప్తాను అని రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వసు ని కలవడానికి వెళ్తాడు రిషి. గౌతమ్ ఎదురుపడటంతో వసు ఎక్కడ అని అడుగుతాడు.
ఇప్పుడే బయటికి వెళ్ళింది అంటాడు. అంతేకాకుండా తను వసుతో మాట్లాడిన మాటలు గురించి చెబుతాడు. దాంతో రిషి నువ్వు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ.. అయిన వాళ్ళు లేకుండా మేము ఎలా పెళ్లి చేసుకుంటాం అనుకున్నావు అని.. ఇలాంటి పిచ్చి సలహాలు మరి ఎప్పుడు ఇవ్వకు అని అంటాడు. ఆ తర్వాత వసు దగ్గరికి బయలుదేరుతాడు రిషి. ఇక గౌతమ్ మాత్రం నేను ఇచ్చింది మంచి సలహానే మీరు అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు.
ఇక వసు అమ్మవారి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటుంది. జగతి వాళ్ల గురించి అమ్మవారికి మొక్కుతుంది. అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. ఇక అమ్మవారి నీకెప్పుడు అన్యాయం చేయదు అని రిషి వసుకి ధైర్యం ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు. ఇంటర్వ్యూ ఎందుకు ఆపావు అని అడుగుతాడు రిషి. మేడం వాళ్ళు లేరని ఎందుకు పోస్ట్ ఫోన్.. నీ విజయం అందరికీ తెలియాలి అని అంటాడు.
అన్ని విషయాల గురించి పాజిటివ్‌గా ఆలోచించు అని అంటాడు. ఇక వసు మాత్రం నేను ఇలాగా ఉన్నాను అంటే దానికి జగతి మేడం కారణం అని.. ఈ క్రెడిట్ మొత్తం మేడం దే అని ఎమోషనల్ అవుతుంది. అంతేకాకుండా రిషి ని పట్టుకొని బాగా ఏడుస్తుంది. ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెబుతుంది. ఆ తర్వాత తనకు ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తాడు.
ఇంట్లో గౌతమ్ ఫణీంద్ర వర్మకు జరిగిన విషయాలు అన్నీ చెబుతాడు. ఇంత జరిగితే మీరేం చేశారు అని ఫణీంద్ర వర్మ కోపడతాడు. ఇక మేము ఎంత ప్రయత్నించినా వాళ్ళు దొరకడం లేదు అని గౌతమ్ అంటాడు. ఇక ఫణింద్ర వర్మ కూడా వాళ్ళు కావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తాం అని అంటాడు. ఇక అక్కడికి రిషి రాగానే తన పెద్ద రాని దగ్గరికి వెళ్లి పలకరిస్తాడు. ఫణింద్ర వర్మ వసుకి కంగ్రాట్స్ చెబుతాడు.
Guppedantha Manasu:
ఇక జరిగిన విషయం మొత్తం తెలిసింది మహేంద్ర వాళ్ళని తీసుకురావడం నీ వల్లనే అవుతుంది అని అంటాడు. ఇక వాళ్ళు కావాలనే దాక్కున్నారు అని అంటాడు రిషి. అలా కాసేపు ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడుకుంటారు.