Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో వసు కాలేజ్ టాపర్ రావడంతో అది చూసి జగతి దంపతులు మురిసిపోతారు. ఇక గౌతమ్ వాళ్లకు జరిగిన విషయాలన్నీ చెబుతాడు. ఇక వసు మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది అని అంటాడు. ఆ తర్వాత గౌతమ్ ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా వచ్చేసేయండి అని అంటాడు. రిషి మిమ్మల్ని ఎప్పుడు కలవాలా అని ఎదురు చూస్తున్నాడు అని చెబుతాడు.
ఇక మహేంద్ర రిషి జీవితంలో ఏది మిస్ అవ్వకూడదు అంటే కొన్ని రోజులు మమ్మల్ని మిస్ అవ్వాల్సి ఉంటుంది అని అంటాడు. ఇక గౌతమ్ మీ మధ్య బాధ చూడలేక నలిగిపోతున్నాను నేను అని అంటాడు. ఇక మరోవైపు రిషి వసు తో ఏం ఆలోచిస్తున్నావు అని అడగటంతో.. లైఫ్ జర్నీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత రిషి ఎన్ని కష్టాలు పడ్డ చివరికి అనుకున్నది సాధించావు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు.
ఇక రిషి నీకేం కావాలో అని అడుగుతాడు. దాంతో వసు ఏం అడిగిన ఇస్తారా అనటంతో కచ్చితంగా అంటాడు రిషి. దాంతో వసు జగతి మేడం అని అంటూ ఉండగా రిషి కారు ఆపుతాడు. అవును సార్ నేను వింటా విజయ్ ని సాధించాను అంటే దానికి కారణం జగతి మేడం. కానీ నేను తనకు ఏమి చేయలేకపోతున్నాను అని అంటుంది. దానితో రిషి ముందు నీకేం కావాలో చెప్పు అంటాడు.
జగతి మేడంని చూడండి తనకు పాదాభివందనం చేయాలి అని అంటుంది. అంతేకాకుండా నాకేం కావాలో చెప్తాను అని చెరువు దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక అక్కడ పేపర్ మీద పేర్లు రాసి పడవలు వదులుతుంది. దానికి రిషి అప్పుడే వదిలావు కదా ఇప్పుడు ఎందుకు అని అడుగుతాడు. ఇప్పుడు వేరే కోరిక అని అంటుంది. జగతి మేడం వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను అని అంటుంది.
ఇలాంటివి బాగా నమ్ముతావు అని రిషి అంటాడు. కాబట్టి నేను కూడా వదులుతాను అని అంటాడు. తాను కూడా త్వరగా పడవలు చేసి వదలడంతో వసు ఆశ్చర్య పోతుంది. ఇక కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు దేవయాని రిషి రాకపోవటంతో వసు తో ఉన్నాడనుకొని జీర్ణించుకోలేక పోతుంది.
వెంటనే ధరణిని పిలిచి గ్రీన్ టీ అడుగుతుంది. దాంతో కొద్దిసేపు ఆగండి వసు ఫస్ట్ వచ్చింది కాబట్టి స్వీట్ చేయాలి అని అంటుంది. దాంతో దేవయానికి చాలా కోపం వస్తుంది. వెంటనే ధరణి తన స్టైల్ లో సమాధానం ఇవ్వడంతో దేవయాని సైలెంట్ గా ఉండిపోతుంది. అంతేకాకుండా ధరణి బాగా వెటకారం కూడా చేస్తుంది.
Guppedantha Manasu:
ఓ వైపు వసు, రిషి పడవలు వదిలేసే పనిలో ఉంటారు. తర్వాత జగతి దంపతులు రావాలని కోరుకుంటారు. ఇక నీళ్లలో వసు జారిపోవటంతో రిషి పట్టుకుంటాడు. కారులోకి వెళ్లి హీటర్ ఆన్ చేస్తానని అంటాడు. ఇక గౌతమ్ కాలేజీలో జరిగిన విషయాలన్నీ దేవయానికి చెప్పటంతో దేవయానికి బాగా కోపం వస్తుంది.