Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో వసు ధరణిని ఏం చేస్తున్నావ్ మేడం అని అడుగుతుంది. దాంతో రిషి కోసం చపాతీలు చేస్తున్నాను అని అనటంతో నేను చేస్తాను అని అంటుంది. దాంతో ధరణి నువ్వు ఇంటి కోడలు అయ్యాక అప్పుడు చేదువులే అంతవరకు నేను చేస్తానులే అని అంటుంది. దాంతో వసు ఊరుకోకుండా నేను చేస్తాను అని పిండి తీసుకుంటుంది. దాంతో ధరణి సరే అని అక్కడి నుంచి వెళ్తుంది.
ఇక అప్పుడే అక్కడికి రిషి రాగా బస్సు ధరణి అనుకోని మాట్లాడుతూ ఉంటుంది. ఇక చపాతీలకు ప్రిన్స్ చపాతీ, జెంటిల్మెన్ చపాతి అంటూ పేర్లు పెడుతూ ఉంటుంది. దాంతో ఎటువంటి శబ్దం రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూసేవారికి అక్కడిక రిషి ఉంటాడు. వెంటనే వసు ఆచార్య పోతుంది. ఇక వారిద్దరి మధ్య అక్కడ కాసేపు అలా మాటలు సాగుతాయి.
ఆ తర్వాత రిషి నువ్వు ఖాళీగా ఉన్నావని నా మీద ప్రయోగాలు చేయకు అంటాడు. ఇక చపాతీలకు కరి చేయాలి అని అడగడంతో నీకు నచ్చింది చేయు అంటాడు రిషి. తర్వాత రిషి తనకు చపాతి చేయాలో నేర్పించమని అంటాడు. ఇక వసు వద్దన్నా కూడా నేర్చుకుంటాడు.
మరోవైపు దేవయాని తలకు మసాజ్ చేస్తుంది ధరణి. ఈ మధ్య మీకు బాగా తలనొప్పి ఎక్కువగా వస్తుంది అని అంటుంది. దాంతో దేవయాని తిరిగి వెటకారంగా మాట్లాడుతుంది. ధరణి కూడా అంతే వెటకారంగా సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత దేవయాని వసు గురించి అడుగుతుంది. కిచెన్ లో చపాతీలు చేస్తుంది అని అనటంతో రిషి కూడా అక్కడే ఉన్నాడా అని అడుగుతుంది దేవయాని.
ఈ మధ్య రిషి తన చుట్టూ తిరగటం ఎక్కువవుతుంది అని.. పిలిచాను అని చెప్పి తీసుకుని రా అని ధరణితో అంటుంది. ఇక రిషి దగ్గరికి వెళ్లి ధరణి అత్తయ్య గారు పిలుస్తున్నారు అనటంతో రిషి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక ఏమైనా కుట్ర చేస్తుందా అని ధరణి భయపడటంతో వసు ధైర్యం చెబుతుంది. రిషి తన పెద్దమ్మ దగ్గరికి వెళ్లగా దేవయాని రిషితో పెదనాన్న రాగానే మీ పెళ్లి గురించి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాము అని అంటుంది.
దాంతో రిషి డాడ్ లేకుండా ఇవన్నీ ఎలా చేస్తాం పెద్దమ్మ అని అంటాడు. దాంతో పెళ్లి అని తెలుసుకున్నాక కూడా వస్తారేమో అని అంటుంది దేవయాని. ఇక వాళ్ళు వచ్చేదాకా పెళ్లి పనులు స్టార్ట్ చేయద్దు అని చెప్పి రిషి అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు. దేవయాని రిషి ఈ మధ్య నా మాటంటే లెక్క చేయకుండా ఉంటున్నాడు అని కోపంగా అనుకుంటుంది.
Guppedantha Manasu:
మరోవైపు రిషి, వసు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇక అక్కడ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆకాశ దీపాలు వెలిగించాలని ఉందని అంటుంది వసు. జగతి మేడం వాళ్ళు తిరిగి తొందరగా రావాలని ఆశిద్దాం అని కోరుకుంటుంది. ఇక రిషి కూడా కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతాడు.