Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసు తలను తుడుస్తూ ఉంటాడు. ఇలా ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది అంటే జాగ్రత్తలు చెబుతాడు. ఇక అదే సమయంలో అక్కడికి ధరణి రావడంతో ముగ్గురు షాక్ అవుతారు. ఆ తర్వాత రిషి కి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది ధరణి. ఇక రిషి కూడా అక్కడి నుంచి వెళ్లగా గౌతమ్ ఎదురుపడి ఎక్ససైజ్ చేయడానికి పిలుస్తాడు.
దాంతో ఇవాళ క్యాన్సిల్ అంటూ.. పైగా తడి తలతో ఎక్కువ సేపు ఉంటే జలుబు చేస్తుంది అని వసు ని తలుచుకొని అనటంతో గౌతమ్ కి అర్థం కాదు. ఆ తర్వాత మినిస్టర్ తో మీటింగ్ ఉందని చెప్పి రెడీ అవ్వమంటాడు. ఇక రిషి అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు వసు రెడీ అవుతూ తనతో రిషి చనువుగా ఉన్న విషయాలు తెలుసుకొని సిగ్గుపడుతుంది.
ఆ తర్వాత రిషి సార్ పక్కనుంటే సార్ కి కూడా ధైర్యం ఉంటుంది కదా అని జగతి మేడం వాళ్ళు అనుకున్నారేమో.. మేమిద్దరం దగ్గరటం కోసం వాళ్ళిద్దరు వెళ్లిపోయారేమో అని అనుకుంటుంది. అప్పుడే రిషికి ఫోన్ వస్తుంది. ఇక మహేంద్ర దంపతులు మినిస్టర్ ను కలవడానికి వస్తారు. త్వరగా అపాయింట్మెంట్ తీసుకొని అఫీషియల్ లెటర్ ఒకటి ఇమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు.
ఇక మహేంద్ర దంపతులు అలా కంగారు పడుతున్న దాన్ని చూసి మినిస్టర్ కి అనుమానం వస్తుంది. దాంతో ఏమైనా ప్రాబ్లమా అని అడగటంతో.. లేదు సార్ త్వరగా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి అని కవర్ చేస్తారు. ఇక వాళ్ళు వెళ్తుండగా రిషి వాళ్ళు కనిపిస్తారు. ఇక వాళ్ల కంటికి కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. అదే సమయంలో రిషికి తన డాడ్ వాడే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది.
కచ్చితంగా డాడ్ వాడే పరిచయం అంటూ అక్కడి నుంచి రూమ్ కి వెళ్తాడు. మినిస్టర్.. మహేంద్ర వాళ్ళు ఇప్పుడే వెళ్లారు అని చెప్పటంతో వెంటనే రిషి అక్కడి నుంచి కంగారుగా పరిగెత్తుతాడు. ఏం జరిగిందని మినిస్టర్ అడగటంతో వసు కవర్ చేస్తుంది. ఇక రిషి వెళ్లేసరికి చుట్టుపక్కల ఎక్కడ కనిపించరు. ఆ తర్వాత మహేంద్ర దంపతులు రిషి ని చూసి సంతోషపడతారు.
Guppedantha Manasu
ఆ తర్వాత రిషి మినిస్టర్ దగ్గరికి వచ్చి ప్రాజెక్టు గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత మినిస్టర్ మహేంద్ర వాళ్ళు ఏర్పాటుకు వెళ్లాలని తొందరగా వెళ్ళారని చెప్పటంతో.. రిషి ఎందుకు వెళ్లారు అని అడుగుతాడు. దాంతో మినిస్టర్ అనుమానంతో అదేంటి అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కదా నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు. ఆ తర్వాత రిషి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. ఆ తర్వాత రిషి తన తండ్రిని తలుచుకొని బాధపడతాడు. ఎందుకిలా తప్పించుకొని తిరుగుతున్నారు అని అనుకుంటాడు.