Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి జగతి తో మాట్లాడుతూ ఉంటాడు. డాడ్ కోసమే మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను.. ఆయన కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధంగానే ఉన్నాను.. కానీ మరో బంధం కలుపుకోవటం కోసం అయితే కాదు. కొత్త అర్థాలు వెతుక్కోవద్దు అని అంటాడు రిషి. దాంతో జగతి కాస్త బాధపడినట్లుగానే కనిపిస్తుంది. ఆ తర్వాత తను దూరమైంది ఇంటికి కానీ బంధాలకి కాదు అని అంటుంది. మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను అని అంటాడు రిషి.
ఆ తర్వాత జగతి నువ్వు, వసు ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పేలోగా వెంటనే రిషి వసును మీ మనిషిలాగా ప్రేమించట్లేదు తనని తనలాగే ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఇక తను ప్రేమిస్తున్న విషయం నేనే ముందు చెప్పాను అని జగతి అంటుంది. ఆ తర్వాత రిషి ఎవరు ఎన్నన్నా నాతో జీవితకాలం ఉంటుంది అని మాట్లాడతాడు. దాంతో జగతి ఈ జగతి మేడం లాగానేనా ఎప్పుడు నీకు తల్లి కాదా.. ఇక అమ్మ అని పిలిపించుకోలేనా అంటూ బాగా ఎమోషనల్ అవడంతో రిషి మౌనంగా ఉంటాడు.
అదే సమయంలో అక్కడికి వసు జ్యూస్ తీసుకుని వచ్చి జగతికి ఇచ్చి ఇద్దరు మౌనంగా ఉన్నారు ఏంటి అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత రిషి మేడంని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు గౌతమ్ మహేంద్ర, రిషిల ఫోటో చూస్తూ అంకుల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారని వాడికి తెలిస్తే నా పని అయిపోతుంది.. ఎందుకంటే అంకుల్ వస్తువులు ఇక్కడే ఉండిపోయాయి అని అనుకుంటాడు.
ఆ సమయంలో మహేంద్ర వర్మ ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇక గౌతమ్ ఈ విషయం రిషికి తెలిస్తే నేనేమైపోతానో అని భయంగా ఉంది అని అంటాడు. దాంతో మహేంద్ర వర్మ ఏం భయపడకు అని ధైర్యం ఇస్తాడు. అసలు నిజం నువ్వు చెప్పవు.. నేను చెప్పను కాబట్టి రిషికి ఏం తెలియదు అని అంటాడు మహేంద్ర. ఆ తర్వాత ఫోన్ కట్ చేశాక గౌతమ్ మాత్రం అదే భయం లో కనిపిస్తాడు.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తూ ఉండగా ఫణీంద్ర వర్మ వసు ను కూడా కూర్చోమంటాడు. వద్దు సార్ జగతి మేడంకి భోజనం తీసుకెళ్లాలి అని తీసుకెళ్తుంది. అప్పుడే మహేంద్ర వసు అందరి గురించి ఆలోచిస్తుంది అని గొప్పగా అనటంతో.. అవును అని ఫణింద్ర వర్మ అంటాడు. తర్వాత వసు జగతికి భోజనం తినిపిస్తుంది. పరిశీ తనకు భోజనం వద్దు అని అక్కడి నుంచి లెగుస్తాడు. వడ్డిస్తాను అని ధరణిని కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తాడు.
ఇక తినొచ్చు కదా అని రిషిని అందరూ అడగటంతో వసు తినలేదు కదా అని అంటాడు. ఇద్దరం కలిసి తింటాం అని అనటంతో దేవయానికి బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రిషి వసుకి మెసేజ్ చేయడంతో వసు బయటకి వస్తుంది. బయటికి వెళ్దామని అలసటతో పాటు ఆనందంగా కూడా ఉన్నాను అని ఆ విషయాలు నీతో పంచుకోవాలని అంటాడు రిషి.
Guppedantha Manasu:
ఇక సమయంలో ధరిని కనిపించడంతో మేడంని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళు బయటికి వెళ్తారు. ఇక కారులో బయలుదేరుతూ ఉండగా సంతోషంగా కనిపిస్తాడు. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని తన డాడ్ గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత వసు జగతిని ఉద్దేశించి మాట్లాడుతుంది.