Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషీ, వసుధార తో బోర్డుపై లెక్క చేయమంటే వసుధార బోర్డుపై తన మనసులో ఆలోచిస్తున్న బంగారు గ్రాముల లెక్కలు వేస్తుంది. దానికి రిషి నేను చెప్పిందేంది నువ్వు చేస్తుంది ఏంది అని వసు ను ప్రశ్నించగా దారికి వసు మౌనంగా ఉంటుంది. అప్పుడు రిషి పరీక్షల టైం దగ్గర పడుతున్నాయి కదా ఏమైనా అంటే డిస్టర్బ్ అవుతుంది అని సరే నువ్వు వెళ్ళు అని అంటాడు. తరువాత మహేంద్ర,జగతి తో తన డ్రైవింగ్ గురించి చెప్పుకుంటూ ఆనందపడుతుండగా గౌతమ్ వస్తాడు. ఏంటి అంకుల్ చాలా ఆనందంగా ఉన్నారు అంటే డ్రైవింగ్ వలన అని అంటే డ్రైవింగ్ లో త్రిల్లింగ్ ఏముంటది అంటాడు గౌతమ్. తరువాత ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుంది కదా రిషి ఈ కాలేజ్ కి ఎండి చాలా పనులు ఉంటాయి కుదిరితే హెల్ప్ చేయాలి అంటూ ఉండగా అటువైపు వసుధార వెళ్తూ ఉండగా గౌతం వసుధార ను పిలిస్తే ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంది. ఏమైంది వసుధార పిలిచినా వినపడకుండా వెళ్ళిపోతుంది అంటూ నేను మాట్లాడుతానని గౌతమ్ వెళతారు.తర్వాత మీటింగ్ ఉందని మహేంద్ర, జగతి లు కూడా వెళ్తారు. మీటింగ్ లో రిషి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా దానికి సంబంధించి చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా 100% రిజల్ట్ సాధించడానికి ఇంకా పిల్లలలో ఆత్మ స్థానం నింపడానికి వీలైనంతవరకు కృషి చేయాలని అంటూ ఇంతటితో ఈ మీటింగ్ అయిపోయింది అంటాడు. అందరూ వెళ్ళిపోతుండగా మేడం మీరు ఉండండి, అంటే దానికి మహేంద్ర నేను కూడా ఉండాలా అంటే డాడ్ మీరు అవసరం లేదు అంటాడు. రిషి, వసుధార మీ స్టూడెంట్ ఏ కదా మేడం మీరైనా చెప్పండి వసు ఇంతకు ముందులా లేదు ఏవేవో చేరి మీద రాసుకుంటుంది క్లాసులో ఏకాగ్రతగా లేదు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటుంది. వసు స్టూడెంట్ ఐకాన్, ఈ కాలేజీకి గౌరవాన్ని తెచ్చింది, యూనివర్సిటీ టాపర్ కావాలి అనుకుంటుంది అంటే దానికి జగతి, రిషి తో తాను ఒక సాధారణ ఆడపిల్ల తనకు కోరికలు,కళలు ఉంటాయి.కానీ తన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసేటంత తెలివి తక్కువ అమ్మాయి కాదు కానీ తనకు జీవితంలో కలలు అనేవి ఉంటాయి కదా ఒకవేళ వాటి ద్వారా ఏమన్నా డిస్టర్బ్ అయి ఉండవచ్చు రిషి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, కరెక్ట్ అవ్వచ్చు,కాకపోవచ్చు ఇక నేను వెళ్లొచ్చా రిషి అంటే ఆల్ రైట్ అంటాడు రిషి.
తరువాత సన్నివేశంలో గౌతమ్ ను మహేంద్ర, వసుధార తో మాట్లాడావా అంటే దానికి గౌతం ఒకప్పుడు రిషి మాటలకు అంతుచిక్కేది కాదు ఇప్పుడు వసుధార విషయంలో కూడా అదే జరుగుతుంది అంటే ఒకే గూటి పక్షులు కదా గౌతమ్ అలాగే ఉంటుంది అనే లోపు అక్కడికి జగతి వస్తుంది. మహేంద్ర, జగతితో ఏం మాట్లాడారు రిషి అంటే ఇప్పుడే చెప్పాలా తర్వాత చెప్పిన సరిపోతుందా అంటే సరే అంటూ రిషి కి ఫోన్ చేసి వెళ్దామంటే నాకు కొంచెం పని ఉంది డాడ్ మీరు వెళ్ళండి గౌతమ్ కార్ తీసుకొచ్చాడు కదా అందులో వస్తా అంటాడు. వసు చేతి మీద ఆ పిచ్చ గీతాలు ఏంటో రెస్టారెంట్ కి వెళ్లి కనుక్కుందాం అనుకుంటాడు రిషి. తరువాత సన్నివేశంలో దేవయాని, సాక్షి లు కలుస్తారు. సాక్షి నీ ఏమాలోచిస్తున్నావని దేవయాని ప్రశ్నించగా ఉంగరం పై వి అక్షరం ఉండడం ఇంకా నా కళ్ళ ముందు అలాగే కనిపిస్తుంది, మర్చిపోలేక పోతున్నాను అంటే దానికి దేవయాని మంచి అవకాశం వదులుకున్నావు. జీవితమంటే అంతే అన్ని దొరకవు. దేవయాని, సాక్షి తో ఇప్పుడు ఏం జరిగింది. ఉంగరం పై వి అనే అక్షరం ఉంది. అయినా ముందే తెలుసు కదా వారిద్దరి ప్రేమ గురించి కొత్తగా ఇప్పుడు ఏం తెలియలేదు కదా ఆయన రిషి ని నీ వైపు తిప్పుకోవాలి కానీ ఇలా మొండిపట్టు పడితే ఎలా చెప్పు. సాక్షి నేనేం చేయాలి అంటే ముందు రిషి పై కోపాన్ని కాస్త తగ్గించుకో, రిషి నీవాడు అనుకో, రిషిను నిన్ను కలిపే ప్రయత్నం మనిద్దరం కలిసి చేద్దాం అంటే ఇది అసలు అయ్యే పనేనా ఆంటీ. అందుకు రిషిను నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాను. పెళ్లి దాకా తీసుకురాలేనా అంటే మనసులో సాక్షి వాళ్లందరినీ ఒక ఆట ఆడుకోవాలంటే ప్రస్తుతం దేవయాని ఆంటీ ఒకటే దారి అనుకొని సరే ఇప్పుడు నేనేం చేయాలి ఆంటీ అంటుంది. నువ్వేమీ చేయొద్దు సాక్షి అంతా నేనే చేస్తాను ఏమి చేసి చూపిస్తాను నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర్లో ఉన్నాయి కావున రిషి, వసుధార లు పరీక్షల మీద దృష్టి పెడతారు ఏ ఆలోచనలు దగ్గరకు రానివ్వరు ఇదే నీకు మంచి టైం, అదును చూసుకొని ఎంటర్ అయిపోవడమే అంటూ దేవయాని,సాక్షికి సలహా ఇస్తుంది.
Guppedantha Manasu:
తరువాత సన్నివేశంలో రిషి రెస్టారెంట్ కు వెళ్తాడు. ఎంతసేపటికి వసు కనిపించకపోవడంతో ఏం కావాలి అని అడిగిన రెస్టారెంట్ ఓనర్ తో వసుధార ఈరోజు రాలేదా అని అడగక వచ్చింది సార్ పర్మిషన్ తీసుకొని తొందరగా వెళ్ళిపోయింది అంటాడు. ఎందుకు తొందరగా వెళ్ళిందని రెస్టారెంట్ ఓనర్ను ప్రశ్నించగా అందుకు ఏమో సార్ మీలాంటి వాళ్ళు ఉండగా తనకి ఏం ఉంటుంది మీరే తన ధైర్యం తనకు కొంత డబ్బులు కావాలి అని అడిగింది. డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. అలాంటి అమ్మాయికి ఏం అవసరం ఉందో ఏమో 10,000 అడ్వాన్స్ తీసుకుంది అంటాడు. దానికి రిషి మనసులో డబ్బు అవసరం ఉంటే నన్ను అడగాలి కదా ఏమై ఉంటుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత వసుధార, రిషి చేయించిన రింగ్ ను చేయంతో కలిపి మెడలో వేసుకొని బాగుంది అని అనుకుంటూ ఉండగా అంతలో రిషి వస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.