Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి గౌతమ్ గదిలో కూర్చొని గౌతమ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడతాడు. నా జీవితంలో డాడ్ కన్నా ఎవరు ఎక్కువ కాదు అంటూ.. ఒక రెండు అక్షరాలు నా చిన్ననాటి సంతోషాన్ని పోగొట్టాయి అని తల్లి ప్రేమ గురించి చెబుతాడు. ఇప్పుడు ఆ రెండు అక్షరాలే మళ్లీ దూరం చేశాయి అని బాధపడతాడు.
ఇక నా జీవితంలో మిగిలింది వసుధార అని.. తను కూడా నన్ను విడిచి వెళ్ళిపోతుంది కంటే భయంకరంగా ఉంది అని అంటాడు. అప్పుడే ఆ మాటలు విన్నావా వసు అక్కడికి వచ్చి రిషి ని ఓదార్చుతుంది. నేను మీ నీడను సార్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని అనటంతో మరి ఆ విషయంలో ఎందుకు అంత ముందుగా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దాంతో వసు ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లి పడుకోమని చెబుతుంది.
ఇక రిషి గదిలోకి వెళ్లి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. వసు కూడా ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు జగతి దంపతులు కూడా బాధలో కనిపిస్తారు. ఇక మరుసటి రోజు ధరణి దగ్గరికి దేవయాని వచ్చి రిషికి కాఫీ ఇచ్చావా అంటూ పొగరుగా అడుగుతుంది. ఇక ధరణి ఇవ్వలేదు అనటంతో ధరణిపై కోప్పడుతుంది.
అప్పుడే రిషి రాగానే కాఫీ పెడతాను అంటూ రిషికి కాఫీ పెట్టి ఇస్తుంది. ఇక రిషి వసుధార కాఫీ తాగిందా అని అడగటంతో ధరణి లేదు అని అంటుంది. దాంతో రిషి నేను వెళ్లి ఇస్తాను అనటంతో దేవయాని నువ్వెళ్లడం ఏంటి అని అడుగుతుంది. వెంటనే రిషి వసు కూడా మన ఇంటి మనిషే కదా అని అనటంతో దేవయాని షాక్ అవుతుంది.
వసు జగతి ఉన్నట్లు ఊహించుకుంటూ మాట్లాడుతుంది. ఆ తర్వాత రిషి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. మళ్లీ రిషి వసుతో ఆ విషయం గురించి అడుగుతాడు. ఆ విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు. తర్వాత వసు బ్యాగ్ పట్టుకొని వెళుతుండగా దేవయాని ఆపి ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది.
Guppedantha Manasu:
వెంటనే వసు నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే చూడటానికి మీరు ఆశగా ఉన్నారని నాకు తెలుసు.. కానీ నేను ఇంటి నుంచి వెళ్లడం లేదు.. ఒకవేళ రిషి సార్ చెప్పిన కూడా నేను వెళ్ళను అని అంటుంది. అప్పుడే అక్కడికి రిషి వచ్చి ఏం జరిగింది అనటంతో వెంటనే వసు మేడంకి నేను ఇక్కడ ఉండటం చాలా నచ్చుతుంది దేవయానిని ఇరికిస్తుంది.