Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో వసు ఇంటర్వ్యూకు రెడీ అవుతుంది. దీంతో వసును వేదిక మీదికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత సన్మానం చేస్తారు. పైగా రిషి వసు మెడలో దండ కూడా వేస్తాడు. దీంతో వసు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక ఇంటర్వ్యూ ప్రారంభం అవ్వగా వసు తన పక్కన జగతి, రిషి ఉండాలని కోరుకుంటుంది.
ఇక అడిగిన ప్రశ్నలకు టకటక సమాధానాలు చెప్పేసింది. ఈ విజయాన్ని నాకన్నా ముందు ఇద్దరు వ్యక్తులు ఊహించారు అంటూ.. నా విజయం వెనుక వాళ్ళిద్దరూ ఉన్నారు అంటూ జగతి, రిషి పేర్లు బయట పెట్టింది. ఒకరు చేయి పట్టి నడిపించిన జగతి మేడం అంటూ.. నాలో ధైర్యం నింపిన రిషి సార్ అని తెలిపింది. ఇక తన ఫ్యామిలీ గురించి కూడా తెలిపింది.
తన ప్రయాణం గురించి కూడా తెలిపింది. విజయం గురించి కొన్ని గొప్ప విషయాలు తెలిపింది. ఇక విదేశాలకు వెళ్తారా అని ప్రశ్న ఎదురవ్వగా.. లేదు ఇక్కడే ఉంటాను మంచి లెక్చరర్ ను అవుతాను అని తన మనసులో మాట బయట పెట్టింది. ఆ తరువాత మీ స్టూడెంట్ ఇంత మంచి విజయాన్ని సాధించినందుకు మీ అభిప్రాయం ఏమిటి అని రిషి ని అడగటంతో వసు గురించి గొప్పగా చెబుతాడు.
ఆ తరువాత.. నువ్వు కాలేజీకే కాదు నాకు కూడా చాలా ముఖ్యమని చెప్పాలనిపిస్తుంది అని వసుతో అంటాడు. దాంతో వసు వద్దు అని ఇది సమయం కాదని అంటుంది. ఇక అందరూ బిజీగా ఉండగా.. మహేంద్ర అక్కడ నుండి మెల్లిగా వెళ్లే ప్రయత్నం చేస్తాడు. దాంతో రిషి ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగటంతో అప్పుడే రిపోర్టర్ వచ్చి రిషితో మాట్లాడతాడు. ఇక మహేంద్ర మళ్లీ మెల్లగా వెళ్ళిపోతూ ఉండగా.. జగతి కూడా మహేంద్రని గమనించి వెళ్లాలని అనుకుంటుంది. దాంతో రిషి జగతిని ఆపి.. డాడ్ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ డాడ్ ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు రిషి.
ఆ తర్వాత జగతి మహేంద్ర తో ఇప్పుడు వెళ్లడం అవసరమా అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి రిషి వచ్చి నీతో మాట్లాడాలి డాడ్ అని అంటాడు. కానీ మహేంద్ర మౌనంగా ఉంటాడు. మరోవైపు జరిగిన వేడుక గురించి ఫణింద్ర వర్మ వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా జగతి వాళ్ళు వచ్చారని చెప్పటంతో దేవయాని షాక్ అవుతుంది.
ఎందుకు వెళ్లిపోయారంట అని దేవయాని అడగటంతో.. వాళ్లకి ఏదో బాధనిపించింది వెళ్ళిపోయారు అవన్నీ ఇప్పుడెందుకు అని అంటాడు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళని అవన్నీ అడిగి ఇబ్బంది పెట్టకు అసలే కాలేజీలో జరిగిన గొడవ సంగతి నీకు తెలుసు కదా అంటాడు ఫణీంద్ర. దాంతో దేవయాని అవును గౌతమ్ చెప్పాడు అని అంటాడు. ఇక గౌతమ్ దేవయానిని చూసి జరిగిన దాని గురించి ఉద్దేశించి చెబుతాడు.
కరెక్ట్ టైంకి మహేంద్ర అంకుల్ వచ్చారు కాబట్టి సరిపోయింది అంటాడు గౌతమ్. ఎవరు చేశారంటావ్ అంటాడు ఫణీంద్ర. ఇందులో అంత పెద్ద రహస్యం ఏమీ ఉండదు గ్రౌండ్ వర్క్ చేస్తే తెలిసిపోతుంది అని అంటాడు గౌతమ్. దాంతో దేవయాని కంగారుపడుతుంది. ఆ తర్వాత రిషి మహేంద్ర తో మాట్లాడుతూ మీరు ఎందుకు వెళ్లారని అడగను కానీ మిమ్మల్ని వదిలి నేను పడిన బాధ నాకు మాత్రమే తెలుసు అంటాడు రిషి. మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి అంటూ ఎమోషనల్ అవుతాడు.
దాంతో కొన్ని పరిణామాలకి మనం బాధ్యులం కాదు బాధితులం మాత్రమే అంటాడు మహేంద్ర. మీరు ఎన్ని చెప్పినా సరే జరిగిందేదో జరిగిపోయింది. నేను మిమ్మల్ని బాధ పెట్టానో పెద్దమ్మ ముందు మీరు హర్ట్ అయ్యేలా మాట్లాడానో తెలియదు కానీ మీరు లేకుండా నేను ఉండలేను ఇక్కడే ఉండిపోండి అని అంటాడు.
Guppedantha Manasu:
కానీ మీరు మళ్ళీ వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంటున్నారు.. ఏంటి డాడీ నాకెందుకు ఇంత శిక్ష. డాడీ నా స్నేహితుడైన మీరే కదా, మీ కన్నా నాకు ఎవరున్నారు అని బాధపడతాడు. నేను మిమ్మల్ని తెలిసో తెలియకో ఏమైనా అంటే ఇంత పెద్ద శిక్ష వేస్తారా అంటాడు రిషి. శిక్ష వేశాను అని నువ్వు అంటున్నావు కానీ నాకు నేనే వేసుకున్నాను అని నేను అనుకుంటున్నాను అని బాధపడుతూ అంటాడు మహేంద్ర వర్మ.