Guppedantha Manasu: ఈ రోజు ఎపిసోడ్ లో రిషి తన తండ్రి వాళ్ళ రాక కోసం తెగ ఎదురుచూస్తూంటాడు. అంతేకాకుండా బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఇక రిషిని చూసి దేవాయని అక్కడికి వెళ్లి ఇంక టిఫిన్ చేయలేదా అని అడుగుతుంది. దాంతో రిషి డాడ్ వచ్చాకే టిఫిన్, టీ అని అంటాడు. వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే వరకు కడుపు మార్చుకుంటావా అని దేవాయ అని అనడంతో వాళ్ళు వచ్చాకే టిఫిన్ చేస్తాను అని రిషి గట్టిగా అంటాడు. ఇక మీ పెదనాన్న నీ గురించి ఎదురు చూస్తున్నాడు అని అంటుంది.
మరోవైపు హాస్పిటల్ లో ఉన్న జగతి దంపతుల పరిస్థితి ఎలా ఉంది అంటూ డాక్టర్ని అడుగుతాడు గౌతమ్. ఇక డాక్టర్ ఆయన పరిస్థితి బాగానే ఉంది కానీ ఆవిడ పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని అంటాడు. దాంతో గౌతమ్ మరింత కంగారు పడతాడు. ఆ తర్వాత డాక్టర్ బ్లడ్ తెప్పించమని అంటాడు. ఇక రిషి కి ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయటం లేదు అని మళ్ళీ ఫోన్ చేస్తాడు.
ఇక రిషి మాత్రం తన తండ్రి గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. డాడ్ ఇక్కడికి రాకూడదని అనుకుంటున్నాడా అని.. టైం అయినా కూడా ఇంకా రాలేదు అని అనుకుంటూ బాధపడతాడు. అప్పుడే అక్కడున్న వసు రిషికి ధైర్యం చెబుతుంది. ఇక గౌతమ్ వసు ఫోన్ కి చేస్తాడు. కరీషి డాడ్ ఫోన్ చేశారా అని ఆ ఫోన్ లాక్కుంటాడు.
ఇక గౌతమ్ ఏదో చెప్పబోతుండగా రిషి గొంతు విని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయవు అని ఒకసారి నువ్వు హాస్పిటల్ కి రా అని అంటాడు. దాంతో రిషి నేను డాడ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు రావడం బాగుండదు అని అనటంతో ఫోన్ కట్ చేస్తాడు. ఇక వసు హాస్పిటల్ కి రమ్మంటున్నారు అంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని అనటంతో వాడు అలాగే అంటాడు లే అని అంటాడు రిషి.
ఇక డాడీ రాకపోయేసరికి నాకు టెన్షన్ గా ఉంది అని తన ఫోన్ తీస్తాడు. ఇందులో గౌతమ్ మిస్డ్ కాల్స్ చూసి ఆశ్చర్యపోతాడు. దాంతో వసు ఇన్ని సార్లు చేశారు అంటే ఏదో సీరియస్ విషయమే అని అంటుంది. రిషి కూడా అవును అని బయలుదేరాలని అనుకుంటారు. మరోవైపు గౌతమ్ రిషి కి ఈ విషయం ఎలా చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటాడు.
వాడికి తెలిస్తే తట్టుకోలేడు అని అనుకుంటాడు. ఇక బయలుదేరిన రిషి వసు తో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు వీడు హాస్పిటల్కి రమ్మంటున్నాడు అని అనుకుంటాడు. తర్వాత హాస్పిటల్ కి చేరుకోగా గౌతమ్ మాత్రం జగతి బ్లడ్ కోసం ట్రై చేస్తాడు. రిషి వాళ్ళు అక్కడికి వెళ్ళగా గౌతమ్ రిషి మహేంద్రను చూపించడంతో వెంటనే రిషి షాక్ అవుతాడు.
ఏమైంది డాడ్ అంటూ ఏడుస్తాడు. మహేంద్ర వర్మ నీ దగ్గరికి వస్తుంటే యాక్సిడెంట్ అయింది అని అనటంతో నా దగ్గరికి బయలుదేరారా అని రిషి ఎమోషనల్ గా అడుగుతాడు. అవును అంటూ ఎమోషనల్ గా చెబుతాడు మహేంద్ర వర్మ. ఇక వసు జగతి మేడం ఎక్కడ అడగటంతో అక్కడనే ఉన్న బెడ్ చూపించడంతో వసు షాక్ అవుతుంది.
Guppedantha Manasu:
అదే సమయంలో డాక్టర్స్ వచ్చి ఆమెకు బ్లడ్ అడిగాను అరేంజ్ చేయలేదా అని అడుగుతారు. అక్కడ డాక్టర్ చెప్పిన బ్లడ్ గ్రూపుకు రిషి నా బ్లడ్ గ్రూపు కూడా అదే నాది తీసుకోండి అని అంటాడు. దాంతో మహేంద్ర వర్మ ఆనందంతో పొంగిపోతాడు. రక్తం పంచిన తల్లికి రక్తం పంచుతున్నాడు అని అనుకుంటాడు. ఇక మేడంకి ఏం కాదు నేనున్నాను అంటూ వసు కు ధైర్యం ఇస్తాడు.