Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో మహేంద్ర, జగతి, గౌతమ్ లు ఎలాగైనా సరే రిషి, వసుధారలు కలుసుకునేలా ప్లాన్ చేయాలని మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. తర్వాత మహేంద్ర, రిషి వద్దకు కాఫీ తీసుకువస్తాడు. రిషి మీరెందుకు తీసుకువచ్చారు నేనే వచ్చేవాడిని కదా అంటే పర్వాలేదు అంటూ రిషి చేతి కట్టును విప్పుతాడు మహేంద్ర. తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఇప్పుడే మెయిల్ వచ్చింది. ఈరోజు మీటింగ్ ఉంది అంటే తాను కూడా వస్తాను అంటాడు రిషి.
తరువాత సన్నివేశంలో రిషి ఆఫీస్ కు వెళ్లి వసుతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో జగతి వచ్చి మీటింగ్ కు సంబంధించిన ఫైలు ఒకసారి చెక్ చేయమంటే లేదు మేడం మీటింగ్ లోనే మాట్లాడుతాను అంటే జగతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మీటింగ్లో అందరూ కూర్చొని ఉండగా రిషి ఈరోజు మిషన్ ఎడ్యుకేషన్ నుండి మినిస్టర్ కు సంబంధించిన కోఆర్డినేటర్ వచ్చి తదుపరి స్కీమ్ గురించి వివరిస్తారు అని అంటాడు.
తర్వాత వసు, మినిస్టర్ గారి కోఆర్డినేటర్ గా వచ్చిందని తెలిసి ఈ విషయం నాకు చెప్పలేదు కదా అని రిషి కాస్త అప్సెట్ మూడ్లో ఉంటాడు. తర్వాత వసువచ్చి మిషన్ ఎడ్యుకేషన్ లో పిల్లల చదువు గురించి స్కీం మంచి ఫలితం ఇచ్చింది. తదుపరి స్కీమ్ వచ్చేసి తల్లిదండ్రుల ఆరోగ్యం అంటూ, పిల్లలు ఏ లోటు లేకుండా చదువుకోవాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉండి పిల్లల చదువుకు ఎటువంటి లోటు ఉండదు అని చక్కగా వివరిస్తుంది.
తర్వాత ఈ స్కీం కు సంబంధించి బయటకు వెళ్లి కొంతమంది పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మొదలు పెట్టాలని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడతారు. మరొకవైపు దేవయాని, గౌతమ్ వద్దకు వచ్చి ఇంతకు ముందు జగతి, మహేంద్ర ఇంకా నువ్వు కలిసి ఏం మాట్లాడుకున్నారు అని కూపి లాగే ప్రయత్నం చేస్తుంది. దేవయాని ఆలోచనలు పసిగట్టిన గౌతం ఏం లేదు పెద్దమ్మ బట్టల గురించి ఇంకా వంటల గురించి మాట్లాడుకున్నాం అంతే ఇంకేం లేదని అంటాడు. అప్పుడు దేవయాని తన మనసులో నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా తొందరలోనే బయట పెడతాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Guppedantha Manasu:
తరువాత సన్నివేశంలో రిషి బయటకు వచ్చి వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న మహేంద్ర, జగతి లు సంతోషిస్తారు. ఇంతలో వసు అక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నారు సార్ అంటే నీ కారు ఎక్కడా అని చూస్తున్నా అంతే అంటాడు. నేను కార్ లో ఎందుకు వస్తాను సార్ క్యాబ్ లో వచ్చాను అంటుంది. నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యావు కదా కనీసం ఒక్క మాట అయినా నాతో చెప్పాలి అని అనిపించలేదా అని ప్రశ్నిస్తాడు. అందుకు ఇంటర్వ్యూ కు వెళ్లాను సెలెక్ట్ అవుతానో లేదో అని అనుమానం ఉండేది తర్వాత సెలెక్ట్ అవడం జరిగింది అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.