Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషి, వసుధార తో నువ్వు నా దగ్గర ప్రతి విషయం దాస్తున్నావు. ప్రతిదీ నా ప్రమేయం లేకుండా నువ్వే డిసైడ్ చేసుకుంటావు. నీ దృష్టిలో నన్ను ఏమనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు. అందుకు బదులుగా వసు ఇప్పుడు నేనేం చేశాను ఎందుకలా అడుగుతున్నారు అంటే సాక్షి కిడ్నాప్ చేసినప్పటి వీడియో ఫుటేజ్ చూపిస్తే ఒక్కసారిగా కంగారు పడి అది కాదు సార్ అసలు జరిగింది అని చెబుతుండగా వద్దు వసు ఏం చెప్పొద్దు నా ప్రమేయం లేకుండానే జగతి మేడం ను అమ్మ అని పిలిచేలా చేస్తావని ఒప్పందం చేసుకున్నావు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగిన సాక్షి విషయం దాచి పెట్టావు.
నువ్వు నన్ను రిషి లాగా ప్రేమించావా లేదంటే జగతి మేడం కొడుకు లాగా ప్రేమించావా అని అడుగుతాడు. నీ మనసులో నువ్వు అన్ని లెక్కలు వేసుకొని, నీకు ఇష్టం వచ్చిన విధంగా ప్లాన్ వేసుకుని ఇదంతా చేస్తున్నావా అంటూ ఇప్పటినుంచి మన మధ్య జగతి మేడం టాపిక్ రావడం నాకు ఇష్టం లేదు. జగతి మేడం ఒక తెలివైన లెక్చలర్ ఆమె సమర్థతను గౌరవిస్తాను అంతే అంటాడు. అప్పుడు వస్తారా మీకు కోపం ఎక్కువ అందుకు భయపడే సాక్షి విషయం మీ దగ్గర దాచాల్సి వచ్చింది అంతకుమించి ఏమీ లేదు అంటే నాకు కోపం ఎక్కువే కానీ అనవసరంగా ఎక్కడపడితే అక్కడ చూపించను. నువ్విలా సైలెంట్ గా ఉంటే మళ్ళీ సాక్షి ఏదైనా చేసే ఆస్కారం ఉంది. ఒక్కోసారి మౌనంగా ఉంటే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. నా దృష్టిలో సమస్యను పరిష్కరించి ముందుకు వెళ్లాలి ఇంకెప్పుడూ సాక్షి, జగతి మేడం ల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. అది మన ఇద్దరి ప్రేమకు మంచిది నాకు ఎన్ని సమస్యలు వచ్చినా పరవాలేదు కానీ నువ్వే ఒక సమస్యగా తయారవ్వకు అంటాడు. నీపై నాకున్న ప్రేమ ఎన్నటికీ తగ్గదు. నన్ను మార్చాలని ప్రయత్నించి కొత్త సమస్యలు సృష్టించొద్దు అంటూ వెళ్దాం పద అంటాడు.
తర్వాత సన్నివేశంలో కార్లో కూర్చొని ఉండగా ఇంతలో అమ్మే వ్యక్తి వచ్చి పూలు కొనుక్కోండి సార్ అంటే పూలు తీసుకోమని చెప్పొచ్చు కదా పొగరు అనుకుంటాడు. మరొకవైపు పూలుకొని తీసుకో వసు అని చెప్తే సంతోషిస్తాను కదా ఆ మాత్రం కూడా చేయలేరా నాకోసం అని అనుకుంటూ ఉంటుంది. రిషి పూలు తీసుకుని వసుకు ఇచ్చి నీపై నాకున్న ప్రేమ ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది అంటే సంతోషిస్తుంది.
Guppedantha Manasu:
తరువాత సన్నివేశంలో వసు పూలను లవ్ సింబల్లాగా వేసి మధ్యలో విఆర్ అని రాసి ఫోటో తీసి రిషికి పంపిస్తుంది. అది చూసి రిషి ఫోన్ చేసి నాకోసం వచ్చేస్తావా అంటే వసు మౌనంగా ఉండడంతో ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో జగతి వచ్చి రిషి తో నేను కాస్త మాట్లాడాలి అనుకున్నాను అంటే చెప్పండి మేడం అంటాడు రిషి. నువ్వు వసూలు దూరం చేసుకోవద్దు ప్రేమగాని, గాజు వస్తువులు గాని ఒకసారి పగిలిపోతే మళ్ళీ తిరిగి లభించవు అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.