Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో వసు ఉద్యోగంలో చేరిన విషయం రిషితో చెప్పనందుకు కాస్త డల్ గా వసుతో కనీసం నీ జాబు విషయం కూడా నాకు చెప్పాలి అని అనిపించలేదా అంటాడు. అప్పుడు వసు అటువంటిది ఏమీ లేదు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంటర్వ్యూ కి వెళ్లాను జాబ్ వస్తుందో రాదు అని అనుకున్నాను అని అంటుంది. ఇంతలో మహేంద్ర వచ్చి మినిస్టర్ గారు రమ్మన్నారు అంటే వసు, రిషి లు బయలుదేరుతారు.
కారులో వెళుతుండగా వసు కార్ ఆపమని చెబుతుంది. ఇక్కడ ఎందుకు ఆపమంటున్నావు అంతా నీ ఇష్టమేనా అంటాడు రిషి. ముందు ఆపండి తర్వాత చెప్తాను అంటే కార్ ఆపుతాడు. కారు దిగినాక రిషి చెయ్యి పట్టుకుని ఆయింట్మెంట్ రాస్తుంది వసు. అప్పుడు రిషి చెయ్యికి తగిలి గాయానికి ఆయింట్మెంట్ రాస్తున్నావు నా మనసు తగిలిన గాయానికి ఏం చేయమంటావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వసు జీవితం అన్నాక అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దాని గురించే ఆలోచించుకుంటూ ఉంటే ఎలా అందుకే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన సార్ అంటుంది.
అప్పుడు రిషి నేను భరించలేనంత బాధను నాకు ఇస్తున్నావు ఈ విషయం నీకు అర్థం అవుతుందా ఎందుకు అంత పట్టుదల నీకు అంటే.. అది అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది అని చెబుతుంది. అప్పుడు రిషి నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు సరిగా చెప్పవా ఏది అడిగినా ఇలాగే డైవర్ట్ చేస్తావు అంటే వసు వెళ్దాం పదండి లేటవుతుంది అని వెళ్తారు. తర్వాత మినిస్టర్ గారు వసు చాలా టాలెంట్ పర్సన్. సివిల్స్ రాస్తే మంచి ఉద్యోగం వస్తుంది కానీ ఈ జాబ్ కావాలని పట్టుబడితే కాదనలేక ఇచ్చాను. అయినా ఎవరు ఇష్టాలు వాళ్ళవి అంటాడు. ఇక రిషితో వసు చాలా మంచి అమ్మాయి జీవితంలో ఎన్నటికీ వదులుకోకు అని సజెషన్ ఇస్తే రిషి మనసులో ఈయన ఏంటి మా గురించి అంతా తెలిసినప్పుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు.
తరువాత మినిస్టర్ గారు మిషన్ ఎడ్యుకేషన్ లాగానే ఈ స్కీం కూడా బాగా అయెట్టు చూడాలని రిషికి చెబితే అలాగే అంటాడు రిషి. మరొకవైపు మహేంద్ర ఆలోచిస్తూ ఉండగా జగతి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. నా రెండు చేతి వేళ్లలో ఒక చేతి వేలును పట్టుకో అంటే ఎందుకు ఇదంతా అంటూ ఉండగా ఇంతలో గౌతమ్ వస్తాడు. గౌతమ్ ఒక చేతివేళ్లు పట్టుకుంటే నాకు తెలుసు వసు, రిషి లు తొందరలోనే ఒకటి అవుతారంటూ సంతోషపడతాడు.
Guppedantha Manasu:
తర్వాత సన్నివేశంలో మహేంద్ర, జగతిలు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దేవయాని వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. అప్పుడు మహేంద్ర ఏమీ లేదు అంటే దేవయాని మీరిద్దరూ కలిసి వసు, రిషి లు ఒకటవ్వాలని, వసు ఈ ఇంటి కోడలు కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అవి ఆపుకుంటే మంచిది అంటుంది. అప్పుడు మహేంద్ర రిషి నా కొడుకు అంటే దేవయాని నాకు బంధుత్వం లేదా.. ఇంట్లో నా మాట చెల్లదా అంటే జగతి ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ మహేంద్ర, దేవయానితో మీ వల్లనే ఇంట్లో సమస్యలు మీరు మౌనంగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం ఉంటుంది. అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.