Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో వసు దేవయానితో గట్టిగా మాట్లాడుతుంది. ఏం చేసిన డైరెక్ట్ గానే చేస్తాను అనికౌంటర్ వేస్తుంది. దాంతో దేవయాని కూడా ఏమాత్రం తగ్గకుండా తనపై మాటల ద్వారా రివేంజ్ తీర్చుకుంటుంది. అయితే వసు ఏం చేస్తున్నా నేరుగా చేయాలి అంటూ.. అయినా మీకు ఈ వయసులో ప్రశాంతత కావాలి అంటూ కాస్త వెటకారం చేసి అక్కడ నుంచి వెళ్తుంది.
దేవయాని కోపంతో త్వరలోనే సంగతి చూస్తాను అని అనుకుంటుంది. మరోవైపు ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి గౌతమ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ సమయంలో డాడీ వాళ్లు ఉంటే బాగుండేది అని బాధపడతాడు. ఇక వస్తారులే అని ధైర్యం ఇస్తాడు. అక్కడికి వసు రావడంతో అడ్వాన్స్ గా కంగ్రాట్స్ అని చెబుతాడు.
కానీ వసు నాకు టెన్షన్ గా ఉంది అంటూ భయపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో నేను పరీక్ష రాసానో తెలుసు కదా అని అంటుంది. ఇక గౌతమ్ అవన్నీ పట్టించుకోకు నువ్వే టాపర్ వి అవుతావు అని ధైర్యం ఇస్తాడు. ఆ తర్వాత ధరణిని అక్కడికి పిలిచి స్వీట్ చేసి పెట్టండి అని అక్కడి నుంచి కాలేజీకి బయలుదేరుతారు.
వసు మాత్రం టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఇక రిజల్ట్స్ వచ్చాయని అందరూ నోటీస్ బోర్డ్ లో చూడడానికి వెళ్తారు. అందరూ జగతి మేడం గురించి అడుగుతారు. అంత రిషి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. ఇక వసుకు తన పేరు కనిపించకపోవడంతో తన పేరును ఉందో లేదో చూడమని తన ఫ్రెండ్ కి చెబుతుంది. దాంతో ఆమె కూడా నీ పేరు లేదు అనటంతో బస్సు చాలా టెన్షన్ పడుతుంది.
ఏడుస్తూ కూర్చుంటుంది. మరోవైపు స్టూడెంట్స్ అంతా రిషి తో తమ సంతోషాన్ని పంచుకుంటారు. సెలబ్రేట్ చేసుకుందామని అనడంతో రిషి సరే అంటాడు. ఇక వసుధార కనిపించట్లేదు అని అడుగుతాడు రిషి. బయట ఉందని చెప్పడంతో రిషి వసు దగ్గరికి వెళ్తాడు. ఇక నేను ఓడిపోయాను అంటూ చాలా బాధపడుతుంది వసు.
రిషి ఆ మాటలన్ని విని తర్వాతకు కంగ్రాట్స్ అని అంటాడు. అంత వసు ఆశ్చర్య పోతుంది. ఇక రిషి నువ్వు ఓడిపోలేదు నువ్వు యూనివర్సిటీ టాపర్ అయ్యావు అని అనడంతో వసు చాలా సంతోషపడుతుంది. బోర్డులో నా పేరు ఎందుకు లేదు అని అడగటంతో టాపర్ పేరు బోర్డులో అవసరం లేదనిపించిందని అంటాడు.
స్టూడెంట్స్ అందరూ వసు దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెబుతారు. ఈ టైంలో జగతి మేడం అంటే బాగుంటుంది అని వసు అంటుంది. ఇక గౌతమ్ అదంతా వీడియో తీసి జగతికి పంపిస్తాడు. ధరణి కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. దేవయాని వచ్చి వెటకారం చేస్తుంది.
Guppedantha Manasu
దాంతో ధరణి కూడా దేవయానిపై కౌంటర్లు వేస్తుంది. జగతి మాత్రం వసు దగ్గర ఉంటే గట్టిగా హాగ్ చేసుకుని ముద్దు పెట్టేసే దాన్ని అని సంతోషంగా చెబుతుంది. తర్వాత రిషి గురించి మాట్లాడుకుంటారు. వాడు నా కొడుకు అంటే నా కొడుకు అంటూ గొప్పగా చెప్పుకుంటారు. ఆ తర్వాత జగతి కాస్త బాధ పడినట్లు కనిపించడంతో మహేంద్ర వర్మ బాధపడకు అని నిన్ను అమ్మ అని పిలుస్తాడు అని ఓదార్చుతాడు.