Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 27వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషీ, వసుధారతో ఈరోజు ప్రయాణం చాలా కొత్తగా ఉంది. నువ్వు నీ మనసులో రిషి సార్ తో మొదట గొడవలతో మొదలై ఒకరికి మీద ఒకరికి కోపాలు తగ్గి చివరకు ఒక్కటైపోయాం అని అనుకుంటున్నావు కదా అంటే దానికి వసు ఇంత కరెక్టుగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే రెండు గుండెల చప్పుడు ఒకటే అయినప్పుడు ప్రేమకు అది సాధ్యమవుతుంది అంటాడు. తరువాత గుడ్ నైట్ చెప్పి ఈ దూరం మనకు అవసరం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషి చాలా ఆనందంగా తన లైఫ్ తాను తనకు దక్కింది అన్న సంతోషంలో ఉంటాడు.
తర్వాత సన్నివేశంలో మహేంద్ర, గౌతమ్ లు సంభాషించుకుంటూ రిషి అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా రిషి వస్తాడు. గౌతమ్ ఏదో అడుగుతుండగా తర్వాత మాట్లాడుకుందాం అంటూ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంతలో జగతి ఎదురుపడితే థాంక్యూ మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు.
తరువాత సన్నివేశంలో రిషి, వసుధార లు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ముందు నేనే మెసేజ్ చేయొచ్చు కదా అనుకుని ఇద్దరు మెసేజ్ లు చేద్దాం అనుకొని నేనే వసుధార ఎగ్జామ్స్ వరకు మాట్లాడొద్దు అని నేనే అన్నాను కదా అని రిషి, మరొకవైపు ఎగ్జామ్స్ అయ్యేవరకు సార్ మాట్లాడొద్దు అన్నారు కదా అని వసు ఆలోచిస్తూ ఉంటారు.
తర్వాత సన్నివేశంలో దేవయాని, సాక్షి తో అప్పుడే బంధం తెంపుకోవద్దు. రిషి ని దూరం చేసుకోవద్దు అంటే ఏమో అంటి నా మనసు విరిగిపోయింది. భర్త ఎలాంటి వాడైనా వేరే అమ్మాయి పేరు తలుచుకుంటే తట్టుకోలేరు. ఏకంగా నిశ్చితార్థం రోజు వి అనే అక్షరాన్ని ఉంగరం చేయించడం నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎగ్జామ్స్ అయ్యేవరకు మౌనంగా ఉండాలి తర్వాత వసు వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి ఒంటరి వాడవుతాడు మన వైపు తిప్పుకోవచ్చు అనే లోపు ధరణి కాఫీ తీసుకువస్తుంది. దేవయాని ధరణిపై కోప్పడుతుంది. ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాక్షి నేను చెప్పింది విను ఇంకేం ఆలోచించకు అంటుంది దేవాయని.
తర్వాత సన్నివేశంలో మహేంద్ర, గౌతమ్, రిషి రూమ్ లో కూర్చుని చర్చిస్తూ ఉండగా అక్కడికి జగతి వచ్చి నిద్ర లేపి ఏం మాట్లాడతారు వద్దు అంటూ ఉండగా ఇంతలో దేవయాని వచ్చి మళ్లీ ఏం చేస్తున్నారు అంతా కలిసి అంటే మహేంద్ర కార్ రిపేర్ ఉందని వెళ్తాడు వేనగానే గౌతమ్ కూడా వెళ్ళిపోతాడు. దేవయాని నువ్వు రిషి ని పేరు పెట్టి పిలుస్తున్నావని విర్రవీగుతున్నావు అమ్మ అని పిలవడం లేదు కదా అంటే నేను రోజు రిషిని చూసుకుంటాను.ఈ ఇంట్లో ఉన్నాను నాకు పెత్తనాలతో అవసరం లేదు. నాకు ఇది చాలు అంటూ కాఫీ చల్లారిపోయింది మళ్లీ తెస్తాను అని గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోతుంది.
Guppedantha Manasu:
తర్వాత సన్నివేశంలో నిద్రలేచిన వసు, రిషి ఫోటో చూస్తూ చదువుకుంటున్నాను సార్ గుడ్ మార్నింగ్ అంటూ నీ ఆశయమే నీకు ముఖ్యం అని పేపర్ పై రాసి గోడకు అతికిస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.