Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ ఆరవ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషి, వసుధార లు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు సర్వే అయిపోయాక ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఆ ఊరి వ్యక్తి కొన్ని జామకాయలు కోసి తెచ్చి తినమని ఇస్తే వసు ఎంతో ఇష్టంగా వాటిని తీసుకుంటుంది. తరువాత వసు ఏదో చెప్పబోతుండగా రిషి ఇప్పుడేం చెప్పొద్దు వసు. ఈ జామకాయల పుట్టుపూర్వత్వాలు అన్ని చెప్పి నా మూడు పాడు చేయొద్దు. ఏకంగా ఈ జామకాయల గురించి ఒక పుస్తకమే రాయగలుగుతావు అని అంటాడు. తరువాత జామకాయ తింటుంటే అలా కాదు సార్ అని కాస్త ఉప్పు కారం తగిలించి తింటేనే దాని రుచి తెలుస్తుంది అని చెబుతుంది.
తర్వాత సన్నివేశంలో రిషి, వసును ఈ స్కూటీ తిరిగి వాళ్లకే ఇచ్చేయి. చూస్తున్నావు కదా స్కూటీ పై వెళ్లే వాళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా స్కూటీ పై వెళ్లాల్సిన అవసరం నీకేంటి అంటాడు. రోజు ఆటోలో తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది సార్ అదే ఈ స్కూటీ అయితే అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు అయినా నేను బాగానే నడుపుతాను అంటుంది. తర్వాత మన ఇద్దరి మధ్యలో ఏ విధమైన మనస్పర్ధలు లేవు కానీ మీరు ఆ ఒక్క విషయంలో ఎందుకు అంత కఠినంగా ఉన్నారు అని అంటేనే వెంటనే రిషి బాయ్ వసు అంటూ అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఇంత చిన్న విషయానికే ఇంతలా కోప్పడాలనుకుని తాను స్కూటీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా ఇంతలో రిషి అక్కడికి వస్తాడు.
అప్పుడు వసు సార్ మీరు ఇంకా వెళ్లలేదా అంటే నా కార్ టైర్ పంచర్ అయింది అంటాడు. దానికి వసు నిజంగా పంచరయ్యిందా అంటే నీలాగా కార్లకు పంచర్ చేసే అలవాటు నాకు లేదు సరే వెళ్దాం పద అంటూ స్కూటీ ఇవ్వమంటాడు. అప్పుడు వసు లేదు సార్ నేనే నడుపుతాను అంటే స్కూటీపై అవతల వైపు కూర్చుంటాడు వసు స్కూటీ డ్రైవ్ చేస్తుంది. వెళ్లేదారిలో అందరూ చూస్తూ నవ్వుకుంటుంటే ఒకచోట స్కూటీ ఆపించి తాను డ్రైవ్ చేసి వసు రూమ్ కి తీసుకెళ్తాడు.
Guppedantha Manasu:
తర్వాత సన్నివేశంలో డ్రాప్ చేసినందుకు థాంక్స్ అంటాడు. నీకు వసు అయ్యో ఇంత దానికి థాంక్స్ ఏంటి సార్ అంటే సరే అంటూ వెళ్తాడు. ఇద్దరి మనసులలో ఉండమని చెప్పి ఉంటే బాగుండేది కదా అని అనుకుంటారు. కాసేపటికి మళ్లీ తిరిగి వస్తాడు రిషి. తర్వాత ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుంటే రిషి, వసు తో నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది జీవిత పాఠాలు చాలా బాగా నేర్చుకున్నాను. మనం కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను పొందాము. జీవితాంతం తోడుగా ఉంటే మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలు మన జీవితంలో ఉంటాయో.. కానీ ఆ ఒక్క విషయంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేక పోతున్నావు. ఆ విషయాన్ని వదిలేయచ్చు కదా అంటాడు. అప్పుడు వసు అందులో నిజం ఏందో నీకు తెలుసా అంటే.. నాకు అంతా తెలుసు అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం చూడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.