Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో రిషి, వసు లు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ, ఫోన్ చేయాలా వద్దా అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో వసు రేపు ప్రాజెక్ట్ విజిటింగ్ కు వెళ్లాలని మెసేజ్ పెడుతుంది. అందుకు బదులుగా రిషి మీ మేడం ను తీసుకువెళ్ళు అని రిప్లై ఇస్తాడు. తరువాత సన్నివేశంలో మహేంద్ర, జగతిలు ఆఫీసుకు బయలుదేరుతుండగా ఇంతలో రిషి వస్తాడు. మహేంద్ర ఆఫీసుకు వెళ్లాలి లేటవుతుంది వెళ్దాం పద అని జగతితో అంటాడు. రిషి, మహేంద్ర తో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. నేనున్నాను కాబట్టి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు అని గ్రహిస్తుంది.
తర్వాత మహేంద్రతో నువ్వు రిషి కాలేజీకి వెళ్లండి. నాకు కాస్త షాపింగ్ పని ఉంది అది చూసుకొని వస్తాను అంటుంది. మనసులో రిషి థ్యాంక్స్ మేడం.. మీరు నిజంగానే షాపింగ్ వెళుతున్నారు లేదో నన్ను అర్థం చేసుకుని వెళ్తున్నారో తెలియదు అనుకుంటాడు. తర్వాత రిషి, మహేంద్ర కారులో వెళ్లిపోతారు. మహేంద్ర, రిషితో నిన్న జరిగిన దానికి నీ కోసం వందసార్లు అయినా సారీ చెప్తాను అది అప్పుడే మర్చిపోయాను అంటాడు. తరువాత ఈ ప్రపంచంలో మనుషులు మాత్రమే మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటేనే మనసు తేలిక అవుతుంది. అంటూ పారే నీళ్లు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి. ఒకే చోట ఉన్న నీళ్లు కొన్ని రోజులకు మురికిగా మారిపోతాయి. మనిషి జీవితం కూడా అంతే అంటాడు.
తరువాత రిషి, మహేంద్ర చేతులు పట్టుకొని నాకు వసుధార కావాలి. కానీ ఈ ఒప్పందాలు, మొహమాటల మధ్యన కాదు నాకు స్వచ్చంగా ఉండే వసుధార మాత్రమే కావాలి. కాలికి ముల్లు గుచ్చుకుంటే అది తేలిగ్గా తీసేయొచ్చు. అదే ముళ్ళు మనసుకు గుచ్చుకుంటే తీయడం కష్టం. ఇప్పుడు వసు నాకు దూరం అవుతుందేమో అనిపిస్తుంది. మీరే ఈ విషయంలో నాకు సహాయం చేయాలి అంటూ మహేంద్రను కౌగిలించుకుంటాడు. జరగని వాటికోసం ఆశపడి ఇప్పుడున్న జీవితాన్ని పాడు చేసుకోవడం కరెక్టేనా డాడ్ అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర మనసులో ఇదంతా గురుదక్షిణ గురించే జరుగుతుంది అనుకుని.. చిన్నప్పుడు అమ్మ కావాలి అనేవాడు కానీ అన్ని ఇచ్చాను ఆ ఒక్కటి తప్ప. ఇప్పుడు అమ్మని వద్దనుకుంటున్నాడు. నన్ను చిక్కు ప్రశ్నల్లో ఇరికించావు రుషి అని అనుకుంటాడు.
తర్వాత సన్నివేశంలో వసు కాలేజీలో కూర్చుని ఉండగా ఇంతలో జగతి వస్తుంది. జగతితో ప్రాజెక్ట్ విజిటింగ్ కు వెళదాం అంటే నాకు కాస్త నలతగా ఉంది. రిషి ని తీసుకువెళ్ళు అంటుంది. సార్ రానని చెప్పారు మేడం అంటుంది. తర్వాత జగతి, మహేంద్ర కి ఫోన్ చేస్తుంది. మహేంద్ర కాలేజీ వద్దనే ఉన్నాము అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మహేంద్ర మనసులో ఒకపక్క జీవితం మరోపక్క జీవిత భాగస్వామి ఎటువైపు నిలబడాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటాడు.
Guppedantha Manasu:
తరువాత సన్నివేశంలో మహేంద్ర, జగతి వద్దకు వస్తాడు. అక్కడ వసు ను చూసి ఎక్కడికి బయలుదేరారు అంటే ప్రాజెక్ట్ విజిటింగ్ కు అని చెప్పి వెళ్తుంది. వసు వెళ్తూ రిషి క్యాబిన్ వద్ద నిలబడి రిషి తో మాట్లాడినట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది ఇదంతా పక్కనుండి రిషి గమనిస్తూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.