Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో వసు, రిషి తో అమ్మను అమ్మ అని పిలవడంలో తప్పేముంది సార్ అంటుంది. ఆ మాట విని కోపంగా వెళ్ళిపోతాడు రిషి. తర్వాత బయట గౌతమ్ వచ్చి రిషిని రిసీవ్ చేసుకుని కారులో తీసుకెళ్తాడు. గౌతమ్, రిషి ని నీ కారు ఎక్కడ.. ఎందుకు నడుచుకుంటూ వస్తున్నావని అడిగితే అప్పుడు రిషి అన్ని చెబితే గాని లిఫ్ట్ ఇవ్వవా అని అడిగితే మౌనంగా ఉంటాడు గౌతం. తర్వాత ఇంట్లో ఒంటరిగా ఆలోచిస్తుంటాడు రిషి. ఈ వసు ఈ ఒక్క విషయంలో ఎందుకింత కఠినంగా ప్రవర్తిస్తుంది. నన్నెందుకు అర్థం చేసుకోలేక పోతుంది అనుకుంటూ ఉండగా గార్డెన్ లో మహేంద్ర ఒంటరిగా కూర్చుని ఉండడం చూసి రిషి అక్కడికి వస్తాడు.
తర్వాత మహేంద్ర తో ఎందుకు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారు. నా విషయంలో మీరు ఏదైనా బాధ పడుతున్నారా. మీ పట్ల నేనేమైనా తప్పుగా ప్రవర్తించానని అడుగుతాడు. అప్పుడు మహేంద్ర అటువంటిది ఏమీ లేదు బంధం చాలా విలువైనది. నేను జగతి దాదాపుగా 20 సంవత్సరాలు విడిగా ఉన్నాం. తర్వాత పరిస్థితుల వల్ల కలిసిపోయాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం అంటాడు. అందుకు రిషి మనమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్లం తరువాత జగతి మేడం మన మధ్యలో వచ్చింది అంటే అందుకు మహేంద్ర, వసు కూడా వచ్చింది కదా అంటాడు. నా జీవితంలో జగతి ఎలాగో నీ జీవితంలో వసు అలాగే అంటాడు మహేంద్ర.
తరువాత మహేంద్ర ఒడిలో కాసేపు తలపెట్టి పడుకుంటాడు రిషి. అప్పుడు మహేంద్ర బంధానికి విలువ ఇవ్వాలి అదే మనతో జీవితాంతం ఉంటుంది అని సలహా ఇస్తాడు. ఇదంతా చూస్తున్న జగతి కి ఒకపక్క సంతోషం.. మరోపక్క బాధ ఉంటుంది. ఇక తర్వాత సన్నివేశంలో వసు కాలేజీకి ఆటోలో బయలుదేరుతుంది. ఆటోలో కూర్చుని మనసులో నేను మీ మాట విన్నాను. మీరు మాత్రం నా మాట వినరా రిషి సార్ అని అనుకుంటుంది. తర్వాత కాలేజీలో బొమ్మల కొలువు చేసుకుంటూ ఉంటుంది. మరొకవైపు రిషి, వాసు ఇంకా రాలేదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి వసు చెయ్యి తగిలి పెయింట్ డబ్బా కింద పడుతుంది.
ఆ శబ్దం విన్న రిషి ఆవుతల వైపు వచ్చి చూస్తే అక్కడ వసు ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటే బొమ్మల కొలువు చేసుకుంటున్నాను అని అంటుంది వసు. తర్వాత వసు నిన్నటి రిపోర్ట్ ఇవ్వమంటారా అని అడిగితే.. ఇచ్చి వెంటనే వెళ్ళిపోతావా అంటాడు. మరేం చేయమంటారు అని అడుగుతుంది వసు. అప్పుడు రిషి నీతో కాస్త మాట్లాడాలి ఆ విషయాన్ని మర్చిపో అంటాడు. అందుకు వసు మళ్ళీ నేను అడిగినదాంట్లో తప్పేముంది అంటూ ఉండగా కోప్పడి కాలేజీలోకి వెళ్తాడు.
Guppedantha Manasu:
తర్వాత రిషి నేను అనవసరంగా కోప్పడ్డానా.. తాను ఏమైనా బాధపడుతుందేమో అని అనుకుంటూ వసు క్యాబిన్లో ఉన్నప్పుడు తీసిన వీడియోను చూసుకుంటూ ఇంతలో వసు వస్తుంది. అప్పుడు రిషి పక్క వాళ్ళ ఫోన్లో తొంగి చూడకూడదు అని నీకు తెలియదా అంటే.. పక్క వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీయొచ్చా అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.