Guppedantha Manasu: ఈ రోజు ఎపిసోడ్ లో ఫణింద్ర వర్మ మిషన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లిన పని సక్సెస్ అయిందని చెబుతూ ఉంటాడు. ఒంటరిగా వెళ్ళినందుకు బాధపడతాడు. దానితో ఫణీంద్ర వర్మ ఏం పరవాలేదు కాలేజీ కోసమే కదా అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రిషి తన తండ్రి కోసం బాధపడుతూ ఉండగా మహేంద్ర వాళ్ళ కోసం బెంగ పెట్టుకోకు అని ధైర్యం ఇస్తాడు.
మరోవైపు వసు జగతి మేడం గురించి ఆలోచిస్తూ భోజనం తినడం మానేస్తుంది. ఇక రిషి తన కోసం భోజనం తీసుకొని వస్తాడు. వసు మాత్రం తినను అంటూ మారం చేయడంతో.. నేను కూడా తినను అని రిషి అంటాడు. దాంతో వసు రిషిని బ్రతిమాలి భోజనం చేయించగా ఆ తర్వాత భోజనం తినిపిస్తాడు.
ఆ సమయంలో జగతి మేడం గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక రిషి ఏం కాదు వారి త్వరలో వస్తారు అని ధైర్యం ఇస్తాడు. అలా వసు బాగా ఎమోషనల్ అవుతూ ఉండగా మరెప్పుడు నువ్వు ఏడవద్దు అని రిషి అంటాడు. దాంతో వసు ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత రిషి తన మనసులో మేడం వాళ్ళు ఇంటర్వ్యూ కి వస్తే బాగుండు అని.. నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు కానీ వసు మీద ఎందుకు అంత కోపం చూపిస్తున్నారు అని అనుకుంటాడు.
ఇక ఇంట్లో వాళ్లంతా ఇంటర్వ్యూ గురించి చర్చలు చేస్తూ ఉంటారు. అప్పుడే దేవయాని మహేంద్ర వాళ్ళు ఉంటే బాగుండు కానీ ఆయన వాళ్ళు ఎందుకు వస్తారులే అంట వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వసు అందరికీ కాఫీ తీసుకొని రాగా తనతో ఈ విజయం సాధించడానికి కారణం ఆ జగతి అని.. అటువంటి మీ మేడం ఇంటర్వ్యూకి రాకపోవడం ఏం బాలేదు అని మాట్లాడుతుంది.
దాంతో వసు నేను ఎప్పుడడూ మేడంని మిస్ అవ్వలేదు అంటూ.. అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు అని రిషి సార్ చెప్పాడు అని అనటంతో.. ఏదో నీ ఏడుపు చూడలేక అలా అన్నాడేమో అని దేవయాని అంటుంది. అప్పుడే గౌతమ్ రిషి ని మేడం వాళ్ళు వస్తున్నారా అని అడగటంతో.. చూస్తూ ఉండు అంటూ తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు రిషి.
దీంతో గౌతమ్ కు కాస్త భయం పుడుతుంది. వీడికి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రిషి జగతికి మెయిల్ చేయడంతో ఆ విషయాన్ని సంతోషంగా మహేంద్ర కు చెబుతుంది. ఇక ఆ మెయిల్ లో.. ఎప్పుడూకూడా మీకు ఇటువంటి లెటర్ రాయాల్సి వస్తుందని అనుకోలేదు.. మీరు చిన్నప్పుడు నన్ను వదిలి నాకు శిక్ష వేశారు.. ఇప్పుడు వెళ్లి అదే శిక్షవసూకి వేస్తున్నారు.
Guppedantha Manasu:
మా డాడీ కోసం ఒక మెట్టు దిగి మిమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించాను. కానీ ఇప్పుడు చెప్పకుండా వెళ్లి మళ్లీ బాధపెడుతున్నారు అంటూ వసు గురించి మెయిల్ చేస్తాడు. ఇక మహేంద్ర జగతితో ఎక్కువగా ఆనంద పడొద్దు అని.. నిన్ను ఒక కొడుకుగా కాకుండా వసుధార కోసం పిలుస్తున్నాడు అని అంటాడు. దాంతో జగతి కాస్త బాధపడుతుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూ కి వెళ్లడం కూడా మంచిది కాదు.. ఆ ఇంటర్వ్యూలో ఏం చెబుతాడో చూద్దాం అంటూ వాళ్ల పెళ్లి నిర్ణయం తీసుకున్నాకే మనం వెళ్ళాలి అని అంటాడు.