Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి చాలా ఎమోషనల్ అవుతూ తన తండ్రిని తనతో ఉండిపోమని అంటాడు. నేను మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నన్ను మందరించాలి కానీ అలా వెళ్ళిపోతారా అని ప్రశ్నిస్తాడు. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను మీరు ఇక్కడే ఉండాలి అని అంటాడు. దాంతో మహేంద్ర కాలమే మనల్ని శిక్షిస్తుంది అని అనటంతో రిషి చాలా ఎమోషనల్ అవుతాడు. అంతేకాకుండా మీరు నేను లేకుండా అసలు రిషి ఎలా ఉంటున్నాడు అని ఆలోచించడం లేదు కదా అని అంటాడు.
ఇవన్నీ ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అని.. నాకోసం తిరిగి వచ్చేసారు అనుకున్నాను అని అంటాడు. అంతేకాకుండా ఈ రాత్రంతా ఆలోచించుకోండి ఈ రిషి ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అని.. ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అని అంటాడు రిషి. రేపు ఉదయం సూర్యోదయ కంటే ముందే మీరు నా దగ్గరికి రావాలి అంటూ.. ఇద్దరం కలిసి టిఫిన్ చేయాలి అని అంటాడు రిషి.
అలా చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు రిషి. ఆ తర్వాత తన తండ్రిని గట్టిగా పట్టుకొని అక్కడ నుంచి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వసు, రిషి తమ గదిలలో కూర్చుని జరిగిన విషయం గురించి తలుచుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు చాట్ చేసుకుంటారు. ఇద్దరు బాల్కానికి వచ్చి మాట్లాడుకుంటారు. ఇక రిషి వసుతో తన తండ్రి గురించి మాట్లాడుతాడు.
ఇక వసు ఎలాగైనా సార్ వస్తారు అంటూ ధైర్యం ఇస్తుంది. ఇక మహేంద్ర కూడా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా రిషి దగ్గరికి వెళ్లాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాను అంటాడు. దానితో జగతి అప్పుడే చెప్పొచ్చు కదా ఈ విషయం అని అనడంతో.. నేను చెప్పే లోపే రిషి నాకు టైం ఇచ్చాడు అని.. వాడి మాటని ఎందుకు కాదనాలని ఉండిపోయాను అని అంటాడు.
ఇక జగతి రిషి గురించి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. ఇక ఉదయాన్నే రిషి దగ్గరికి వెళ్లడానికి సంతోషంగా ఉంటాడు మహేంద్ర వర్మ. ఇక జగతి కూడా సంతోషంగా ఉంటుంది. ఇక రిషి వాళ్ళను చూసి ఇంకా పడుకోలేదా అంటుంది దేవయాని. డాడీ వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను అనడంతో వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని.
Guppedantha Manasu:
అంతేకాకుండా రిషి ని బాధపెట్టే విధంగా మాట్లాడుతుంది. ఇక రిషి అక్కడి నుంచి వెళ్లగా వసు రేపు మేడం వాళ్ళు వస్తారు అని సంతోషంగా కనిపిస్తుంది. దేవయానికి బాగా కోపం వస్తుంది. ఓ వైపు జగతి రెడీ అయ్యి వెళ్దామా అనడంతో వెంటనే మహేంద్రవర్మ ఇప్పుడు టైమ్ ఎంత అవుతుంది అనుకున్నావు అని అంటాడు. ఆ తర్వాత మహేంద్ర అక్కడికి వెళ్లడం మంచిదేనా.. మనం వచ్చిన పని అసంపూర్ణం అవుతుందేమో అని అనటంతో మళ్లీ మనసు మార్చుకుంటున్నావా అని భయపడుతూ అడుగుతుంది జగతి.