Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈరోజు ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో జగతి, రిషీకి ఆనందంగా కాఫీ ఇస్తుంది. ఇంతకుముందు నేను మీకు థాంక్స్ ఎందుకు చెప్పానంటే ఒక విధంగా మీరు చాలా హెల్ప్ చేశారు. తరువాత కాఫీ తీసుకొని పక్కకు వెళ్తాడు రిషీ. ఇంతలో అక్కడికి మహేంద్ర వస్తే జగతి ఆనందంతో మహేంద్ర, రిషీ అనేలోపు నేను అంతా విన్నాను జగతి, రిషి నీకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తాడు అని అనుకోలేదు అంటాడు. మరొకవైపు వసుధార వి అక్షరం గుర్తు ఉన్న ఉంగరాన్ని చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేను సాక్షికి ఎప్పుడో చెప్పాను తనకు రిషి సార్ ని చేసుకునే అర్హత లేదు అని అదే నిజమైంది. ఈ ఉంగరం నాకోసమే చేయించారా లేదా అనుకోకుండా నా పేరు పెట్టారా, కావాలనే నా పేరు పెట్టారా ఏదైనా మంచికే జరిగింది. ఇది నేనెలా పెట్టుకుంటాను కృషి సార్ పెడితే బంధం అవుతుంది. వి ఒంటరిగా ఉండకూడదు. వి ఫర్ వసుధార. వసుధార ఒంటరిగా ఎలా ఉంటుంది పక్కన ఆర్ చేరితే బాగుంటుంది. బి ఫర్ వసుధార, ఆర్ ఫర్ రిషి. బంగారంతో చేయించాలంటే చాలా ఖర్చవుతుంది. కనీసం రెండు మూడు గ్రాములైన పడుతుంది. ఏమో ఈ బంగారం గురించి నాకు తెలియదు.కానీ ఏదో విధంగా చేయించాలి. వి ఆర్ జంటగా బలే కనిపిస్తున్నాయి.
తరువాత సన్నివేశంలో మహేంద్ర,జగతితో నాకు చాలా సంతోషంగా ఉంది. రిషి నిన్ను సార్ అని పిలవద్దు. అంటే నీవేమీ అనుకుంటున్నావు అని ప్రశ్నించగా దానికి జగతి సార్ అని పిలిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అలా పిలవద్దు అని ఉండవచ్చు సరే పద అంటాడు మహేంద్ర. ఇంతలో మహేంద్ర అయ్యో కార్ టైర్ పంచర్ అయింది అంటాడు. ఇప్పుడు ఎలా మహేంద్ర ఎక్స్ ట్రా టైర్ ఏమైనా ఉందా అంటే లేదు ఇంతకుముందే పంచర్ అయితే పంచర్ షాప్ లోనే ఉంచేశాను. సరే ఉండు క్యాబ్ బుక్ చేస్తాను అనే లోపు రిషి గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు. మహేంద్ర, రిషిని కౌగలించుకొని ఆనందంగా గుడ్ గుడ్ మార్నింగ్ చెబుతాడు. ఇదేమిటంటే మీ మీద ప్రేమ కలిగింది హత్తుకున్నాను దీనిలో తప్పేముంది అంటాడు మహేంద్ర. మహేంద్ర, రిషితో మా కార్ టైర్ పంచర్ అయింది మేం క్యాబ్లో వస్తాం అంటే పంచర్ అయితే క్యాబ్ లోనే వెళ్లాలా లిఫ్ట్ అడిగి వెళ్లకూడదా నేను ఈ ఇంటిలో సభ్యుడినే, కాలేజ్ కి వెళ్తున్నాను. అంటే మీకు బయట ఏమన్నా పనులు ఉంటాయి ఏమో అంటుంది జగతి. అప్పుడు మహేంద్ర అవును రిషి నువ్వు కాలేజీకు ఎండి కదా చాలా పనులు ఉంటాయి అంటే సరే రండి అంటాడు రిషి. తరువాత మహేంద్ర ను కార్ డ్రైవ్ చేయమని తాను వెనకాల సీట్లు కూర్చుంటానని మేడం ముందు కూర్చోండి అంటాడు రిషి. ఇంతలో మహేంద్ర చేతిలోని కి తీసుకొని జగతి కార్ డ్రైవ్ చేస్తుంది. మరొకవైపు వసుధార ఆటో కోసం ఎదురుచూస్తూ ఎంతసేపైనా ఒక్క ఆటో కూడా రావడం లేదు ఏంటి అనుకుంటూ అయినా ఆటోలో కాకుండా నడిచి వెళితే ఆ డబ్బులు ఉంగరం తయారు చేయడానికి పనికొస్తాయి. చాలా అవసరం అయితేనే తప్ప ఆటోలో వెళ్ళకూడదు నడిచే కాలేజీకి వెళతాను అంటూ నడుచుకుంటూ వెళ్తుంది.
తరువాత సన్నివేశంలో జగతి సడెన్ కార్ ఆపుతుంది. మహేంద్ర ఏమైంది జగతి అని ప్రశ్నించగా వెనకాల వసు వస్తుంది గమనించావా అంటుంది. కారు ను గమనించిన వసుధార సార్ కారులో ఉంది కదా అని పరుగెత్తుకుంటూ వచ్చి జగతిని చూసి ఆశ్చర్యపోయి మేడం సార్ కారు మీరు నడుపుతున్నారేంటి సార్ ఎక్కడ అంటే దానికి జగతి వెనకాల ఉన్నట్టు సైగ చేస్తుంది. మహేంద్ర,జగతిని నేను కార్ డ్రైవ్ చేస్తాను ఇవ్వు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఇలా అందరినీ కారులో కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది అంటాడు మహేంద్ర. జగతి, వసుధార తో ఏంటి ఆలోచిస్తున్నావు కూర్చో అంటే వసు రిషి పక్కన కూర్చుంటుంది. వసుధార, రిషికి గుడ్ మార్నింగ్ చెబుతుంది. తరువాత మహేంద్ర కార్ డ్రైవ్ చేస్తాడు. మహేంద్ర కావాలనే కారణం స్పీడ్ గా మలుపులు తిప్పుతాడు. వెనకాల కూర్చున్న రిషి, వసుధార లు ఒకరిపై ఒకరు పడతారు. రిషి ఏంటి డాడీ ఇది అంటే రోడ్లు బాగాలేవు బాగా వర్షాలు పడి రోడ్లు బాగా లేకపోతే ఏం చేయాలి అంటాడు. రిషి డాడ్ చిన్నగా పోనివ్వండి అంటే సరే రిషి నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది తెలుసా అంటాడు మహేంద్ర. రిషి నా డ్రైవింగ్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి,కామెంట్ చేయండి,సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రోడ్లు బాగా లేకపోయినా ఇంత బాగా డ్రైవింగ్ చేశాను కదా నా డ్రైవింగ్ కు రేటింగ్ ఇవ్వాలి. ఎంత ఇస్తారు చెప్పండి అంటే రిషి అసలు రేటింగ్ ఇవ్వను డాడ్ అంటే వచ్చేసాం రుషి దగ్గరలోనే ఉన్నాం అంటాడు.
Guppedantha Manasu:
తర్వాత సన్నివేశంలో క్లాస్ రూమ్ లో వసుధార ఉంగరం గురించి ఆలోచిస్తూ డబ్బులు చాలా కావాలి ఏం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అని ఆలోచిస్తూ ఉంటే పక్కనున్న అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు అంటే వంద ఆలోచిస్తున్నాను. పుష్ప ఆలోచించాక తీరిగ్గా చెబుతాను అనుకుంటూ బంగారం ధర ఎంత ఉందో చూద్దాం అనుకొని ఫోన్లో బంగారు ధరను క్యాలిక్యులేట్ చేస్తుంది. ఉంగరం తయారు కావడానికి ఒక మూడు గ్రాముల బంగారం కావచ్చు. అంటే 4950 ఒక గ్రాము అనుకుంటే ఇంకా 300 మేకింగ్ చార్జెస్ అనుకుంటే అమ్మో చాలానే అయ్యట్టు ఉంది కదా అని అనుకుంటూ ఉండగా ఇంతలో క్లాస్ రూమ్ లోకి రిషి ఎంటర్ అవుతాడు. రిషి క్లాసులో అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పడం, వసుధార ఏదో పరధ్యానంలో ఉండడం గమనించి అందరినీ కూర్చో అంటాడు. రిషి, వసుధార అని పిలిస్తే అప్పుడు లేచి సార్ ఒక గ్రాము 4950 అంటే దానికి రిషి ఏంటి అంటాడు. అప్పుడు వాసు ఏం లేదు సార్ అని కూర్చుంటుంది. రిషి, వసుధార వద్దకు వచ్చి బుక్ తీసుకొని ఈరోజు కఠినమైన లెక్కని వేరే విధంగా ఎలా చేయాలో చెప్తాను అంటూ బోర్డుపై లెక్కను రాస్తుంటాడు. మరోవైపు వసుధార నాకు వచ్చిన ఆలోచన వింటే రిషి సార్ షాక్ అవుతారు. ఏదో మిస్ అయ్యాను ఏంటది అని అనుకుంటూ రెస్టారెంట్ మేనేజర్ ను అడ్వాన్స్ అడగాలి అని మనసులో అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్న వసుధార ను రిషి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించగా ఏం లేదు సార్ ఉంటుంది. అప్పుడు రిషి స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర్లో ఉన్నాయి. ప్రిపరేషన్ బాగా చేసి రెండు మూడు సార్లు రివైన్ చేసుకోవాలి. ఒక్క సబ్జెక్ట్ అని కాదు వేటికవే చాలా ఇంపార్టెంట్. వసుధార దీన్ని కంప్లీట్ చెయ్ వచ్చా అని రిషి ప్రశ్నించగా, వచ్చు అని తల ఊపుతుంది. రిషి 2 మెథడ్ లలో చెప్పాను. సెకండ్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేస్తావో చెయ్యి అంటే ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.