Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ సరదాగా కూర్చొని క్యారమ్స్ ఆడుకుందామని టీం ని సెలెక్ట్ చేసుకుంటే జగతి, రిషీలు ఒక టీం, మహేంద్ర, వసుధార లు ఇంకో టీం. ఆట మధ్యలో జగతి కాస్త టెన్షన్ పడితే మీరు కాయిన్ వేయగలరు మేడం అంటూ జగతిని ఎంకరేజ్ చేసి ఇలా ఆడండి అంటూ చూపించి గెలిచేలా చేస్తాడు. జగతి చాలా సంతోషిస్తుంది. మరోవైపు దేవయాని చిరాకు, కోపంగా చూస్తుంది.
తరువాత సన్నివేశంలో దేవయానితో ఆమె భర్త జగతి నగలు జగతికి ఇచ్చేస్తే బాగుంటుంది ఇంతకంటే మంచి సందర్భం రాకపోవచ్చు అని వెళ్ళిపోతాడు. ఏదో ఆలోచిస్తున్న దేవయాని వద్దకు రిషి వచ్చి ఈ నగలు ఏంటి పెద్దమ్మ అంటే కాస్త కంగారు పడి, దేవయాని మనసులో ఇవి జగతి నగలు అని తెలిస్తే నా పరిస్థితి ఇంకేమైనా ఉందా ఆరోజు రిషికి అబద్ధం చెప్పాను నాపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నేనే పోగొట్టుకున్నట్టు అవుతుంది అనుకొని రిషితో ఇవి నావే మీ పెదనాన్నగారు పెళ్లిరోజు కానకగా జగతికి ఇవ్వమన్నారు అంటుంది. అప్పుడు రిషి మీది ఎంత మంచి మనసు పెద్దమ్మ అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చి గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటాడు.
తర్వాత అక్కడకి గౌతమ్ వచ్చి ఏదో చెబుతుండగా నా మూడ్ బాగాలేదు ఏదైనా ఉంటే డాడ్ తో చెప్పు అంటాడు. గౌతమ్ ఏమైందిరా అంటే కొందరికి కావలసినప్పుడు దొరకాల్సింది దొరకదు. సమయం దాటినాక దొరికిన ప్రయోజనం ఉండదు ప్రస్తుతానికి డాడ్ సంతోషమే నాకు ముఖ్యం అని ఏవేవో చెబుతుంటే, అప్పుడు గౌతమ్ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు కదా ప్రస్తుతానికి సంతోషంగానే ఉన్నారు కదా పైగా పెళ్లిరోజు కూడా సంబరంగా చేయాలి అనుకుంటున్నాం కదా ఇంకేం కావాలి అంటే వాళ్ళిద్దరూ చాలాకాలం విడివిడిగా ఉన్నారు అంటే గౌతం ఇప్పుడు ఒకటయ్యారు కదా మనసులో నుంచి ఆ ఆలోచనలు తీసేయ్ డల్ గా ఉంటే బాగుండదు పాదా వెళ్దాం అని తీసుకెళ్తాడు.
తరువాత సన్నివేశంలో వసుధార ఏ డ్రెస్ వేసుకోవాలి. రిషి సార్ కు స్పెషల్ గా కనపడాలి ఆయన చెప్పకపోయినా మనసులో అయినా వసు డ్రెస్ బాగుంది అనుకుంటే చాలు అని ఆలోచిస్తుండగా ఇంతలో రిషి వచ్చి ఒక కవర్ ఇస్తాడు అందులో చీర ఉంటుంది. ఈ చీర నేను కట్టుకోవాలా అంటే, రిషి ఈ చీర నీకు బాగా సూట్ అవుతుంది అంటాడు. వసు థాంక్స్ చెప్పి చీర కోసమే కాదు నా గురించి కూడా మీరు ఆలోచిస్తున్నందుకు అంటుంది. తరువాత సన్నివేశంలో జగతి వద్దకు దేవయాని వచ్చి చిన్నచిన్న వర్షపు చినుకులు కురిస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షం పెద్దదైతే వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోతాయి నీ జీవితంలో చాలా కష్టాలు పడ్డావు అంటూ ఉండగా జగతి నేను కావాలని పడలేదు పరిస్థితులు అలా కల్పించి పడ్డాయి పైన ఉన్న భగవంతునికి కింద ఉన్న కొందరికి మాత్రమే ఇది బాగా తెలుసు అంటుంది.
Guppedantha Manasu:
మీ బావగారు మీ పెళ్లి రోజుకు ఈ నగలు నీకు ఇవ్వమన్నారు అందుకే తెచ్చాను అంటే మీకు ఇవ్వాలని లేదా అంటే నాకు ఉంది కాబట్టే తెచ్చాను అంటుంది దేవయాని. తర్వాత జగతి థాంక్స్ చెబితే ఎందుకు అని దేవాయని అడుగగా నేను కూడా ఈ ఇంటికి కోడల్ని అని గుర్తు చేసినందుకు అంటూ సంతోషంగా ఈ నగలు తీసుకుంటున్నాను. అక్కడినుండి చిరాకుగా దేవయాని వెళ్లిపోతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.