Guppedantha Manasu: ఈ రోజు ఎపిసోడ్ లో వసు కోసం రిషి వెతుకుతాడు. మరోవైపు వసు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన పేరు రిషి పేరు కలిసి వచ్చేలాగా బుక్ మీద రాసుకుంటుంది. వెంటనే రిషి ఆ బుక్ లాక్కుంటాడు. ఏం చేస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు రిషి. దాంతో వసు నా ప్రేమ నా బుక్కు అని లాక్కుంటుంది. కాసేపు వారి ఇద్దరి మధ్య అలా సరదా గొడవ జరుగుతుంది.
మరోవైపు గౌతమ్ ను మహేంద్ర వర్మ రిషి గురించి అడుగుతాడు. దాంతో గౌతమ్ జరిగిన విషయం చెబుతాడు. దయచేసి ఈ అజ్ఞాతవాసం వీడండి అని అక్కడి నుంచి చెప్పి వెళ్తాడు. జగతి కూడా వెళ్లిపోదాం అని అంటుంది. మహేంద్ర వర్మ మాత్రం మౌనంగా ఉంటాడు. మరోవైపు రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటాడు రిషి.
అప్పుడే అక్కడికి వసు వచ్చి భోజనం చేయమని అంటుంది. ఇక దేవయాని కూడా బాక్స్ తీసుకొని వస్తుంది. అది చూసి రిషి ఆశ్చర్యంగా నువ్వేంటి పెద్దమ్మ ఇక్కడ అని అంటాడు. ఇక దేవయాని నువ్వు ఆకలితో ఉంటావని తెలిసే తీసుకొచ్చాను అని డైలాగ్ కొడుతుంది. ఇక వసుతో చూసావా వసు పెద్దమ్మకి నేను అంటే ఎంత ప్రేమ అని కొన్ని డైలాగులు కొడతాడు రిషి.
వసు తన మనసులో అంత నటన సర్ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో అని అనుకుంటుంది. ఆ తర్వాత రిషికి భోజనం వడ్డిస్తుంది దేవయాని. వసుకి కూడా వడ్డించు అని అంటాడు రిషి. ఇక వసుకి వడ్డిస్తూ కాస్త వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. ఇక రిషి.. పెద్దమ్మ ప్రేమ చూపించడం మొదలుపెడితే మనం తట్టుకోలేము అని అంటాడు.
వసు మాత్రం తన మనసులో నిజం తెలిస్తే అప్పుడు ఉంటుంది అని అనుకుంటుంది. ఓవైపు మహేంద్ర వర్మ రిషి గురించి బాధపడుతూ ఉంటాడు. రిజల్ట్ వచ్చే టైం కి ఒక్కడే అయ్యాడు అని అనుకుంటాడు. పక్కనే ఉన్న జగతి మనం ఒంటరి వాడిని చేసాము అని ఇంటికి వెళ్దాము అని అంటుంది. దాంతో మహేంద్ర వర్మ మనం అనుకున్నది సాధించేవరకు ఇక్కడే ఉండాలి అన్నట్లు మాట్లాడుతాడు.
Guppedantha Manasu:
అయినా నేను ఆలోచిస్తుంది ఉందామా వెళ్దామా అని కాదు.. ఈ పరిస్థితి రిషి ఎలా ఎదుర్కొంటాడు అని అంటుంది జగతి. దాంతో మహేంద్ర వర్మ అయినా అక్కడ వసు ఉందిగా అని తానే చూసుకుంటుంది అనిఅంటాడు మహేంద్ర. దాంతో జగతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.