Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 29వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో మహేంద్ర, గౌతమ్ లు రిషి నిద్రలేవక ముందే అక్కడకు వెళ్లి, రిషి నిద్రలేచాక నిన్న వసుధారను కలిసావా ఏం మాట్లాడుకున్నారు అని కుపి లాగడానికి ప్రయత్నిస్తారు. వసుధార డి బి ఎస్ టి కాలేజ్ కు దొరికిన ఒక ఆణిముత్యం తన లక్ష్యం ఏంటో తనకు గుర్తు చేశాను. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా వాటి గురించి చర్చించాము అంటే ఇక వేరే విషయం ఏమీ మాట్లాడుకోలేదా అంటే ఏముంది అంటాడు రిషి. అప్పుడు రిషి వసు నువ్వు గెలవాలి అని మనసులో అనుకుంటాడు.
తరువాత సన్నివేశంలో వసు ఇంకా తన ఫ్రెండు ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉండగా రిషి కనబడితే ఆనందంతో దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని నాకోసమే వెయిట్ చేస్తున్నారా అంటూ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి సార్ అంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ వసూ నీకేమైంది అంటే వసు కు గుర్తుకొస్తుంది తాను పట్టుకుంది రిషి చెయ్యి కాదు ఫ్రెండ్ చేయని ఇదంతా నా ఊహనా అని పుష్ప జీవితం ఎంతో ఇష్టమైనది కదా అంటే సడన్గా జీవిత గురించి మాట్లాడుతున్నావ్ ఏంది వసు అంటుంది. రిషి పక్కనే ఉన్న మాట్లాడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అనుకుంటాడు. మరోవైపు వసు కూడా రిషిసారు తో మాట్లాడకుండా, జీవితంలో బాధాకరమైన విషయం ఇదే అని అనుకుంటుంది. రిషి వసు కోసం క్యాబ్ బుక్ చేస్తాడు. వసు క్యాబ్లో వెళ్తూ జెంటిల్ మ్యాన్ సార్ మీరు అని మనసులో అనుకుంటుంది.
తరువాత సన్నివేశంలో మహేంద్ర, గౌతమ్,రిషీ ఇంకా వాళ్ళ పెదనాన్న కలిసి కాలేజీకి సంబంధించిన విషయాలు చర్చించుకుంటూ ఉండగా ఇంతలో జగతి వచ్చి కార్ రెడీగా ఉందా అని గౌతమ్ ని అడుగుతుంది. ఎక్కడికి అని అడగక వసుకు బుక్స్ ఇవ్వాలి ఎగ్జామ్ కు సంబంధించి అంటుంది. నేను వస్తానని అంటాడు రిషి. ఇంతలో తను గతంలో చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి గౌతమ్నే వెళ్ళమంటాడు.
తర్వాత సన్నివేశంలో చదువుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న వసుకు కారు శబ్దం వినపడి రిషి సార్ వచ్చారా అని బయటకు వస్తే అక్కడ గౌతమ్, జగతిలు కనపడతారు. రిషి సార్ రాలేదా అని అడిగితే మేము వచ్చాము కదా వసు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి నీ ఏకాగ్రత అంతా చదువుపై ఉండాలి అంటుంది జగతి. రిషి ఏమన్నాడు అని జగతి అడగగా ఏమంటారు ఆల్ ద బెస్ట్ చెప్పి బాగా చదువుకోమన్నారు అంటుంది అప్పుడు గౌతమ్ బాగా చదివి కాలేజీ పేరు నిలబెట్టాలి అంటాడు అలాగే సార్ అంటూ మనసులో రిసి సార్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తప్పకుండా అని అంటుంది.
తరువాత సన్నివేశంలో ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్న రిషికి, వసు కాఫీ తీసుకువస్తుంది. అప్పుడు రిషి, అసలు నువ్వు వచ్చావా నాకోసం కాఫీ తెచ్చావా అని అంటే దాని గౌతమ్ నేను వసూ ఏంటి నేను రా గౌతం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
Guppedantha Manasu:
తరువాత సన్నివేశంలో వసు చదువుకుంటూ ఉండగా ఋషి వచ్చి పక్కన వచ్చినట్టు అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే కూడా బయట రిషి కడపడతాడు. అప్పుడు వసు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సార్ అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కూడా రిషికి ఇంట్లో వసు కనపడితే నువ్వేంటి ఇక్కడ అంటే మీకోసమే వచ్చారు సార్ అంటూ ఉండగా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.