Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర వర్మను ధరణి చిన్న మామయ్య వాళ్లకు ఎలా ఉంది అడగటంతో బాగానే ఉన్నారు ఇంటికి వస్తారు అని అంటాడు. దాంతో ధరణి వాళ్ళ ఇంటికి వస్తారు అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అప్పుడే దేవయాని మధ్యలో కలిగే చేసుకొని మీ అందరికంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ వెటకారం చేస్తుంది.
ఎగిరిపోయిన పిట్టలు గూటికి చేరుకుంటున్నాయి అని దేవయాని అనటంతో వెంటనే ఫణీంద్ర వర్మ అలా ఎందుకు అంటున్నావు ఏదో అలిగి వెళ్లిపోయారు వచ్చాక అడుగుతాను అని అంటాడు. దేవయాని మాత్రం వెటకారంగా మాట్లాడుతూనే ఉంటుంది. ఆ సమయంలో ఫణింద్ర వర్మ కు ఫోన్ రావడంతో బయటికి వెళ్తాడు.
ఇక ధరణి దేవయాని వైపు చూస్తూ నాకు భయంగా ఉంది అని.. అత్తయ్య వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవటానికి కారణం మీరే అని తెలిసి పోతుందేమో అని అనడంతో దేవయాని కంగారుపడి అలా ఎవరు అన్నారు నీతో అని కోపంగా ఉంటుంది. ఇక నిజం నిప్పులాంటిది అని ధరణి అనటంతో వాళ్లకంటే ముందే నువ్వే చెప్పేలా ఉన్నావు అని.. అయినా అత్త కోడలు ఫ్రెండ్స్ లాగా ఉండాలి అని అంటుంది.
దాంతో ధరణి తన మనసులో దేవయానికి టైం స్టార్ట్ అయింది అని అనుకోగా వెంటనే దేవయాని ఏంటి అనడంతో లేదు అత్తయ్య మనం ఫ్రెండ్స్ అని అంటుంది. దేవయాని ఈ ధరణి ఎప్పటికీ అర్థం కాదు అని అనుకుంటుంది. మరోవైపు జగతికి జ్యూస్ కలిపి ఇస్తుంది వసు. కానీ జగతి వద్దు అనడంతో తాగమని బ్రతిమాలుతుంది.
ఆ తర్వాత జగతి ఈ మాటలు మాట్లాడటంతో ఆ మాటలు వసుకు అర్థం కాదు. ఇక మీరుమమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టారో అర్థం కావట్లేదు అంటుంది వసు. ఇక ఈ విషయాల గురించి ఎందుకు ఏమిటి అని అడగొద్దు అని అంటుంది జగతి. మీరు వెళ్లాక చాలా బాధపడ్డాం అని గతంలో పడిన బాధల గురించి చెబుతుంది వసు.
Guppedantha Manasu….
జగతి కూడా మేము కూడా చాలా బాధపడ్డాము అని అంటుంది. ఇక దానికి కారణం ఏంటి అని మళ్లీ వసు అడగటంతో అవన్నీ అడగొద్దు అన్నాను కదా అంటుంది జగతి. తర్వాత కొన్ని విషయాలు చెబుతుంది. చిన్నప్పుడు రిషి ఏం అడిగినా కాదనలేదు అంటూ.. ఏం అడిగినా చేసేదానిని అని అందుకే ఇంటర్వ్యూ రోజు రమ్మని మెయిల్ చేస్తే ఉండలేక వచ్చాను అంటుంది జగతి.
దాంతో వసు సంతోషపడి నమ్మలేకపోతున్నాను అని.. ఇంత టెన్షన్ పడుతుంటే మేడం కచ్చితంగా వస్తారు అని ధైర్యం చెప్పారు అని.. నాకోసం సర్ అలా ఆలోచించాడా అని సంతోషపడుతుంది. ఆ తర్వాత రిషి గురించి గొప్పగా చెబుతుంది వసు. అంతేకాకుండా కొన్ని ఎమోషనల్ డైలాగులు కూడా కొడుతుంది.
అదే సమయంలో అక్కడికి రిషి, మహేంద్ర వర్మ వచ్చి డిస్చార్జ్ కి ఒప్పుకున్నారు అని చెప్పటంతో అందరూ సంతోషపడతారు. తర్వాత హాస్పిటల్ బిల్లు మహేంద్ర కట్టబోతుంటే రిషి ఆపి తను కడతాడు. చూసి అందరూ మురిసిపోతారు. తర్వాత అందరూ కారులో బయలుదేరుతూ ఉండగా రిషి, వసు లను చూసి జగతి మురిసిపోతుంది.