Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 24వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో వసుధార పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రిషీ సార్ ఏం చేస్తున్నారు అంటూ వీఆర్ అక్షరం ఉన్న ఉంగరాన్ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. మరొకవైపు రిషీ దువ్వెన కోసం వెతుకుతుండగా వసు యొక్క కర్చీఫ్ దొరుకుతుంది. దానిని చూస్తూ వసు నువ్వు ఒక జ్ఞాపకం గా మిగిలిపోవద్దు. నువ్వు ఎప్పటికీ నా కళ్ళముందే ఉండాలి, నాతోనే ప్రయాణం చేయాలి అంటూ క్యాలెండర్ పై 24 తేదీని మార్క్ చేసి డి బి ఎస్ టి కాలేజ్ ఫేర్వెల్ పార్టీ అని రాస్తాడు. ఫేర్వెల్ పార్టీ స్టూడెంట్స్ కా లేక నాకు వసుధార అని అనుకుంటాడు.
తర్వాత సన్నివేశంలో కాలేజీకి వెళ్తున్న మహేంద్ర, జగతిలను దేవయాని ఆపి ఫేర్వెల్ పార్టీ బాగా చేస్తున్నట్టున్నారు కదా అయినా ఏం జరిగినా మీరిద్దరూ, మీ శిష్యురాలు వసు చాలా హడావిడి చేస్తారు కదా అంటే, దానికి జగతి నువ్వు మాట్లాడేది ఏంటి అంటే డిబిఎస్టి కాలేజ్ అంటే వసు, వసు అంటే డిబిఎస్టి కాలేజ్ కదా అని దేవయాని అంటే, జగతి ,వసు అంతా ఎత్తుకు ఎదుగుతే బాగానే ఉంటుంది. దేవయాని ఇంట్లో స్వీట్స్ చేయించాను మీరు తిని ఫేర్వెల్ పార్టీకి తీసుకువెళ్లండి, అంటే దానికి మహేంద్ర ఇంట్లో చేయించడం ఏంది అంటాడు. జగతి మన మనసులో విషం పెట్టుకొని స్వీట్లు చేతిలో పట్టుకుంటే అంత బాగుండదు అంటుంది. దేవయాని ఏంటి నువ్వు మాట్లాడేది జగతి విషం ఏంటి, రిషి నిన్ను అమ్మ అని పిలవాలని నాకు కూడా ఉంది. నేను కూడా మంచి మనసుతో కోరుకుంటున్నాను కదా మరి జరగడం లేదు ఏంటి. రిషినీ ఏమని పిలుస్తావు నాలాగా నాన్నా, బాబు అనలేవు కనీసం రిషి అని పేరు పెట్టి కూడా పిలవలేవు అంటుంది. ఇంతలో రిషి అక్కడికి వస్తుండగా జగతి రిషి అని పిలిచి కాఫీ ఇస్తుంది. ధరణి, దేవయాని మనసులలో జగతి, రిషి నీ పేరు పట్టి పిలిచింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటే రిషి కాఫీ తీసుకొని తాగుతుండగా ఫోన్ రింగ్ అయితే జగతి రిషి ఫోన్ వస్తుంది అంటుంది. తర్వాత రిషి అ కప్ నాకు ఇవ్వు అంటూ కప్ తీసుకుంటే దేవయాని ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది. అది సంగతి అక్కయ్య మరి నిన్ను కాలేజీకి వెళ్లుస్తాను ధరణి అత్తయ్యకు మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అంటుంది.
తరువాత సన్నివేశంలో కాలేజీలో ఫేర్వెల్ పార్టీకి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చూస్తుంటాడు రిషి. అక్కడికి వసు వచ్చి సార్ నాకేమైనా పని చెప్పండి అంటే ఫైనలియర్ స్టూడెంట్స్ అంతా అతిథులు నువ్వు కూడా ఫైనల్ స్టూడెంట్స్ కదా ఏ పని వద్దు నువ్వు నాకు కనిపిస్తూ ఒక చోట కూర్చో అంటాడు. ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి గౌతమ్ ను పిలిచి వాళ్ళిద్దర్నీ కాసేపు ఒంటరిగా విడిచి పెడితే బాగుంటది అంటే గౌతం అక్కడ పనిచేసే వాళ్ళందరినీ తీసుకువెళ్తాడు. ఇంతలో తన పెదనాన్న వచ్చి రిషి ఒకసారి ఇలా వస్తావా కాస్త పని ఉంది అంటే సరే పెదనాన్న అంటూ వసు ఇక్కడే ఉండు నేను వస్తాను అంటూ వెళ్తాడు రిషి.
Guppedantha Manasu:
తరువాత రిషి మహేంద్రతో ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని సంభాషిస్తూ ఉండగా ఇంతలో అతని పెదనాన్న వచ్చి రిషి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అని తీసుకెళ్తాడు. మహేంద్ర, జగతితో ఫేర్వెల్ పార్టీ అయిపోయాక ఎగ్జామ్స్ అయిపోతాయి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే అవకాశం ఉండకపోవచ్చు అంటే దానికి జగతి, వసు ఈరోజు తన మనసులోని మాట చెప్పేస్తుంది అనుకుంటున్నాను. పక్కపక్కనే ఉంటారు.ఒక్క మాట చెప్పుకోవడానికి ఇన్ని రోజులు పట్టాయి అని అనుకుంటూ ఉంటే ఇంతలో రిషి ప్రోగ్రాం స్టార్ట్ చేసి స్టూడెంట్స్ కు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గాలిపటానికి దారం ఎంతో అవసరం అని దారం ఉన్నంతవరకు గాలిపటం బానే ఉంటుందని స్పీచ్ ఇస్తాడు. మీ కలలను నిజం చేసుకోండి. అందరికీ ఆదర్శంగా ఉండండి అంటాడు. తరువాత జగతి మేడంను మాట్లాడమంటాడు. జగతి మీరంతా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని నేను ఆశిస్తున్నాను. గంధం చెట్టు నుండి ఒక కొమ్మను నరికిన దాని సువాసన మాత్రం అందులో ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటుంది. మీరంతా కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను .ఎగ్జామ్స్ బాగా రాయండి. ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చు అంటుంది జగతి. అందరూ స్టూడెంట్స్ వసుధార వసుధార అంటే జగతి వసుధార రా అని పిలుస్తుంది. వసు స్టేజ్ పైకి వెళ్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.