Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్లో గౌతమ్ మహేంద్ర దంపతులతో మాట్లాడుతూ ఉంటాడు. రిషిని ఇంకా దూరం ఉంచటం మంచిది కాదు అని సలహా ఇస్తాడు. దాంతో మహేంద్ర రిషి గురించి మీ ఇద్దరికే కాదు నాకు కూడా చాలా బాధ ఉంది అని అంటాడు. వదిన ఆటలు కట్టాలనే ఇలా చేస్తున్నాను అని అంటాడు. ఇక జగతి మనం ఇంత ప్రయత్నం చేస్తే ఆఖరికి రిషి, వసు కలుసుకుంటారా అని అంటుంది.
వెంటనే మహేంద్ర మనం తనని దూరం పెట్టినప్పటి నుంచి వసు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే రిషి ప్రవర్తనలో మార్పు మొదలైనట్లే కదా అంటాడు. అంతేకాకుండా వదిన ఆలోచన నుండి కాపాడుతుందని నమ్మకం కూడా ఉంది అని అంటాడు. ఇంకా అంతకంటే మనం కోరుకునేది ఏంటి అని అంటాడు మహేంద్ర.
వెంటనే జగతి.. కానీ మనం దేవయాని అక్కకి అవకాశం ఇచ్చినట్లు అయింది కదా అని అంటుంది. ఇక మహేంద్ర మనం అనుకున్నది జరుగుతుంది అని ధైర్యం ఇస్తాడు. ఇక గౌతమ్ తో కొన్నాళ్లు ఓపిక పట్టాలి అని అంటాడు. మరోవైపు కాలేజీలో కొత్త అడ్మిషన్స్ తో పాటు మిషన్ ఎడ్యుకేషన్ పనులు గురించి చూడాలి అని స్టాఫ్ తో చెబుతాడు రిషి.
ఇక వాళ్ళు మహేంద్ర సార్ లేరు అనేటడంతో కచ్చితంగా వస్తారు అని.. ఆయన వచ్చేవరకు ఏ పనులు ఆగకూడదు అనే రిషి అంటాడు. ఇక వసు ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. ఇక సార్ కి ఎంత నమ్మకమో అని కానీ తనకు మాత్రం నమ్మకం కుదరటం లేదు అని అనుకుంటుంది.
ఆ తర్వాత వసు బయటికి వచ్చి జగతి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. జగతికి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదే సమయంలో తనకు ఒక ఫోన్ రావడంతో జగతి అనుకొని లిఫ్ట్ చేస్తుంది. కానీ ఆ సమయంలో తనకు మీడియా వాళ్ళు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కోసం వస్తున్నామని అంటారు.
వసు మాత్రం తనకు ఇంటర్వ్యూ పై ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెబుతుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి మీరు లేకుండా ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేను అని జగతి వాళ్ళని తలుచుకొని బాధపడుతుంది. ఓవైపు ఫణింద్రవర్మ ఇంటికి రావడంతో దేవయాని మహేంద్ర దంపతుల గురించి లేనిపోని విషయాలు చెబుతుంది.
దాంతో ఫణేంద్ర.. ముందు రెండు రోజుల వచ్చేస్తాడని చెప్పావ్ ఇప్పుడు ఇంకేదో చెప్తున్నావ్ అంటూ దేవయానిపై అనుమానం పడతాడు. అంత దేవయానికి కాస్త డ్రామా క్రియేట్ చేస్తుంది. నేను మహేంద్ర ని ఎలా చూశానో మీకు తెలుసు కదా అని మాయమాటలు చెబుతుంది. అంతేకాకుండా వారిపై లేనిపోనివి చెబుతూ బాగా నటిస్తుంది.
Guppedantha Manasu:
ధరణి ఆ మాటలు విని ఆశ్చర్య పోతుంది. గౌతమ్ వసు దగ్గరికి వచ్చి రిషి గురించి అడుగుతాడు. ఆసమయంలో రిషి మహేంద్రదంపతుల గురించి తలచుకోవటంతో వాళ్ళు ఇప్పుడు రారు అంటూ నోరు జారుతాడు గౌతమ్. దాంతో వసు ఆశ్చర్య పోతుంది. అంతేకాకుండా అనుమానం రావటంతో సార్ వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతుంది. ఇక గౌతమ్ తడబడుతూతప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ అభిప్రాయాన్ని చెప్పాను అని అంటాడు.