Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర వర్మఅనుకున్నది సాధించాను అనిపిస్తుంది అని జగతితో అంటాడు.ఇక జగతి కూడా ఒక రకంగా చూస్తే దేవయాని అక్కయ్య ఓడిపోయినట్లే అని.. మిమ్మల్ని రిషి రమ్మంటున్నాడు కానీ తప్పు పట్టలేదు కదా అని అంటుంది. ఇక రిషి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెబుతుంది. మరోవైపు రిషి తన డాడ్ వాళ్ళు వస్తారు అని నీట్ గా పెడుతూ ఉంటాడు.
ఇక వసు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అనడంతో డాడీ వాళ్లు వచ్చే టైం అయింది కదా అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. అంతేకాకుండా ఇకపై తన తండ్రిని దూరం చేసుకోను అంటూ మాట్లాడుతాడు. ఇక మహేంద్రవాలు వస్తున్నారని తెలుసుకోవడంతో దేవయాని కోపంతో.. వదిలింది అనుకున్న పీడ మళ్ళీ వస్తుందా.. వెళ్ళిపోతే రిషి నా గుప్పెట్లో ఉంటాడు అనుకున్నాను కానీ అవుతుంది ఏంటి అని అనుకుంటుంది.
ఇక జగతి, మహేంద్ర కారులో ఇంటికి బయలుదేరుతారు. మహేంద్ర రిషి గురించి మాట్లాడుతూ ఇన్నాళ్లు చాలా బాధ పెట్టాను అని.. రోజు చాలా కొత్తగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో జగతి కూడా రిషికి నీకు ఉన్న సంబంధం అటువంటిది అని మాట్లాడుతుంది. ఇక తను వెళ్లగానే రిషి చూపించే ప్రేమ గురించి చెప్పుకుంటూ మురిసిపోతాడు.
జగతి కూడా ఆనందపడుతుంది. ఆ సమయంలో అనుకోకుండా వారికి ప్రమాదం జరుగుతుంది. అక్కడున్న వాళ్లు వెంటనే జగతి దంపతులను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఓ వైపు రిషి తన తండ్రి వాళ్ళు రాకపోయేసరికి కంగారు పడతాడు. దేవయానిని ఫోన్ చేశారా అడగటంతో లేదు అని అంటుంది. దాంతో దేవయాని వాళ్ల గురించి మరింత నిప్పులు చల్లుతూ మాట్లాడుతుంది.
వెంటనే రిషి వాళ్ల గురించి అలా అనకు పెద్దమ్మ అంటూ అక్కడినుంచి వెళ్తాడు. అక్కడే ఉన్న గౌతమ్ రిషి బాధను చూసి మహేంద్ర వాళ్లకు ఫోన్ చేయాలని అనుకుంటాడు. కానీ ఆగిపోతాడు. అంతలోనే గౌతమ్ ఫోన్ కి హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో వాళ్ళు జరిగిన విషయం చెబుతారు. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యిందని కారులో మీ విస్టింగ్ కార్డు తో మీకు ఫోన్ చేశాను అని అంటారు.
దాంతో గౌతమ్ తను విస్టింగ్ కార్డు చాలామందికి ఇచ్చాను అనుకోని ఎవరో అని హాస్పిటల్ కు బయలుదేరుతారు. ఇక రిషి మాత్రం చాలా కంగారు పడతాడు. ఇక్కడనే ఉన్న వసు ధైర్యం ఇస్తుంది. గౌతమ్ వెళ్తుండగా రిషి పక్కనే ఉండమని అంటాడు. దాంతో గౌతం జరిగిన విషయం చెప్పటంతో రిషి వెళ్ళమని అంటాడు.
Guppedantha Manasu:
ఆ తర్వాత రిషి చాలా కంగారు పడుతూ ఉంటాడు. వసు ఎంత ధైర్యం చెప్పినా కూడా అలాగే ఉంటాడు. హాస్పిటల్ కి గౌతమ్ పేషెంట్ వాళ్ళని చూయించమని అంటాడు. అక్కడ తీసుకుంటున్న జగతి దంపతులను చూసి షాక్ అవుతాడు. చాలా కంగారు పడతాడు. రిషికి ఈ విషయం తెలిసే తట్టుకోలేడు అని కానీ ఎలాగైనా ఫోన్ చేయాలి అని ఫోన్ చేయడంతో.. ఆ ఫోన్ దేవయాని చూస్తుంది. అంకుల్ వాళ్లు వచ్చారా అడగటానికై ఉండొచ్చు అని ఆ ఫోన్ కట్ చేస్తుంది.