Guppedanta Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఈరోజు ఆగస్టు 17వ తేదీ ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో చూద్దాం..
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో గౌతం, ధరణిని స్వీట్స్ కావాలని అడగగా దానికి జగతి అలాగే చేసి ఇవ్వమని ధరణికి చెప్తూ ఉంటే అక్కడికి దేవయాని వచ్చి మీరంతా నిశ్చితార్థం ఆగిపోయినందుకు ఆనందంతో స్వీట్లు చేయాలి అనుకుంటున్నారా అంటూ జగతి ఇంకా ధరణిపై విరుచుకుపడుతుంది. అప్పుడే ఎవరి బుద్ధి ఏంటి అని బయటపడుతుంది అని దేవయాని అంటే దానికి జగతి కరెక్టే చెప్పారు. మీ మీ బుద్ధి గురించి మాట్లాడేంత బుద్ధి నాకు లేదని అనుకుంటున్నాను.అప్పుడు గౌతమ్ బదులుగా దేవయానితో సాక్షి మిమ్మల్ని భయపెట్టి బెదిరించింది. కదా తనంతట తానే నిశ్చితార్థం వద్దనుకొని వెళ్ళిపోయింది. కదా దానికి మీరు బాగా సంతోషించాలి. అంతలోనే రిషి ఎంటరై పెద్దమ్మను ఎవరు ఒక్క మాట కూడా అనకూడదు అంటాడు. దానికి దేవయాని నామీద నీకున్న ప్రేమ కొత్తగా ప్రపంచానికి తెలియని అవసరం లేదు రిషి అంటుంది. రిషి పెద్దమ్మతో మీరు బాధపడటం లేదు కదా అని అంటే దానికి గౌతమ్ పెద్దమ్మ చాలా సంతోషంగా ఉన్నారని సెలబ్రేట్ కూడా చేసుకుందాం అనుకుంటున్నామని అంటే అక్కడినుండి దేవయాని వెళ్లిపోతుంది. గౌతమ్ స్వీట్స్ చేస్తున్నారు కదా వదిన అంటే ధరణి చేస్తున్న అంటుంది. తరువాత సన్నివేశంలో ఆటోలో వెళ్తూ వసుధార ఆ ఉంగరాన్ని చూస్తూ పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఉండగా ఇంతలో రిషి ఫోన్ చేసి ఆటో దిగమని చెప్తాడు. ఎక్కడ అని వసు అడిగేలోపే రిషి అక్కడికి వచ్చి వసు ను పికప్ చేసుకుంటాడు.
తరువాత మహేంద్ర ఆనందంగా నిశ్చితార్థం ఆగిపోయినందుకు సంతోషంగా ఉంటే దానికి జగతి ఎమోషన్స్ అనేది కంట్రోల్ లో ఉండాలి దానికి మహేంద్ర మేము ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకోము ఏడుపొస్తే ఏడుస్తాం నవ్వొస్తే నవ్వుతాం మనిషి అంటే ఎలా ఉండాలో తెలుసా దేవయాని వదినలా ఉండాలి ఆవిడ అంతే మంచి చెడు పక్కన పెడితే తను ఏం చేయాలన్నా ఏం సాధించాలన్న అదే చేస్తుంది. అప్పుడు జగతి ఇంతకీ దేవయాని వదిన ఎలా ఉన్నారో అంటే దానికి మహేంద్ర ఇంకెలా ఉంటుంది నేను ఒకటి అనుకుంటున్నాను. మరోవైపు దేవయాని రిషి తన కంట్రోల్ నుండి తప్పిపోయాడని అనుకుంటూ ఎలాగైనా తన గుప్పెట్లో పెట్టుకోవాలని కోపంతో చిరాకుతో గదిలో ఉన్న వస్తువులను పగులగొడుతుంది. సాక్షి ద్వారా జగతి మీద ఆ వసుధార పగ తీర్చుకుందాం అంటే ఇలా జరిగిందేంటి. ఎందుకు సాక్షి ఇలా చేసింది. సాక్షిని రిషికి ముడి పెట్టడం అనేది అసాధ్యమైన పని ఇప్పుడు ఎలా చేయాలి అనుకుంటుంది. పైనుంచి వచ్చే శబ్దాలను చూసి జగతి వదిన పైన ఎలా ఉందో చూడాలని అంటే దానికి సరే అని చెప్పి ధరణి దేవయాని వద్దకు వస్తుంది.
దేవయానికి కోపంతో బయటకు వెళ్ళమని నువ్వు ఎందుకు వచ్చావు ఎవరు పంపిస్తే వచ్చావో నాకు తెలుసు అంటుంది. చెబుతే బయట జగతి వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించగా అత్తయ్య చాలా కోపంగా చిరాకుగా ఉన్నారని డాక్టర్ గారిని చూపిస్తే మంచిదని అంటుంది ఇంతలో అక్కడకు దేవయాని ఇంకా మహేంద్ర వచ్చి, దేవయాని నన్ను పేషంట్ల ఒక మూలన కూర్చోబెట్టాలి అనుకుంటున్నారా అంటుంది. రిషి పెళ్లి తప్పిపోయిందని సంతోషపడుతున్నారా ఏం మహేంద్ర మాట్లాడవేంటి ఒకసారి రిషి నిశ్చితార్థం తప్పిపోయింది మరోసారి పెళ్లి తప్పిపోయింది నేను అందుకు బాధపడుతున్నాను. సాక్షితో రిషి పెళ్లి అయినా కాకపోయినా నాకు బాధ లేదు. ప్రేమించిన వసుధార మోసం చేసింది చివరిదాకా ఉన్న సాక్షి పెళ్లి వద్దని చెప్పి వెళ్ళిపోయింది రిషి ఎంత బాధ పడుతున్నారో మీకు తెలుసా దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఎంతసేపు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని అని ఆలోచించడం తప్పు అని జగతి ,మహేంద్ర లను నిలదీస్తుంది. జగతి నువ్వు ఇంటికి వచ్చావు కానీ ఏనాడైనా రిషి గురించి ఆలోచించావా అంటూ వెళ్ళిపోతుంది. జగతి మహేంద్రతో అక్కయ్య అన్నట్టు ఇందులో నా తప్పేమైనా ఉందా అంటే దానికి మహేంద్ర బదులుగా ఏం మాట్లాడుతున్నావ్. ఆవిడ ఏదో అందని నువ్వు ఎందుకు బాధపడుతున్నావ్ ఆవిడ ఎప్పుడు అంతే. వదిన గారి నిజస్వరూపం రిషి కి త్వరలోనే తెలుస్తుంది. మన ప్రమేయం లేకుండా ఎలా తప్పిపోయిందో అలాగే జరుగుతుందని ఆశిద్దాం.
తరువాత సన్నివేశంలో రిషి జరిగిందాని గురించి ఏమనుకుంటున్నావు అని వసుధార అడుగగా దానికి ఏమీ లేవు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అంటుంది. నీకు తెలియకుండా నీ పేరు వాడుకున్నందుకు ఏమైనా అనుకుంటున్నావా ఒకవేళ అలా అనుకుంటే దానికి అనిలోపే దానికి సారీ చెప్తారా సార్ అలాంటివేవీ చెప్పొద్దు సార్ మీరు అంటుంది. నిజంగా సాక్షి దగ్గర జరిగిన విషయంలో నేను ఏది కావాలి అని చేయలేదు. దానికి వసు సార్ మీరు నాకు సంజాయిషీ ఇవ్వడం ఏంటి. ఒక్కోసారి అడగకుండా కూడా సంజాయిసి ఇవ్వవలసి వస్తుంది వసుధార. నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఒక్కసారి వర్షం తుఫానుగా మారుతుంది. నా జీవితంలో తుఫాను వెలసినట్టుంది. సాక్షి నాకు దూరమైందని ఆశ్చర్యం ఏమీ లేదు. తను ఎప్పుడూ నా దగ్గర ఉందని దూరం అవడానికి ఏదైనా భూతద్దంలోంచి చూస్తే దగ్గరగా కనబడుతుంది. అంతమాత్రాన దగ్గర ఉన్నట్టు కాదు కదా. సాక్షి కూడా అంతే. సాక్షి దూరమైంది కదా అని కొత్త ప్రశ్నలు వేసి నిన్ను ఇబ్బంది పెట్టను. జీవితంలో చాలా మంది క్లారిటీ లేకుండా ఉంటారు. చాలా తక్కువ మందే క్లారిటీతో జీవిస్తుంటారు. వాళ్లను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏది ఏమైనా నేను గెలిచాను వసుధార అంటే దానికి నేను కూడా గెలిచాను సార్ అంటుంది. రెస్టారెంట్ కే కదా వెళ్లేది కదా వెళ్దాం అంటాడు.
Guppedanta Manasu:
తరువాత సన్నివేశంలో రెస్టారెంట్ లో గౌతమ్, మహేంద్ర హాయిగా పాటలు పాడుతుంటే జగతి నవ్వుకుంటుంది. మహేంద్ర గౌతమ్ తో నాకు ఆనందంగా హాయిగా ఉంది అంటే దానికి గౌతమ్ సాక్షి పోయింది ఇది ఇంకా నేను నమ్మలేకపోతున్నాను. దానికి జగతి ఒక మంచి పనికి అన్నీ తోడైనట్టే చెడు పనికి ప్రకృతి కూడా సహకరించదు అంటారు. అప్పుడు మహేంద్ర అవును జగతి నాకైతే ఒక తీన్మార్ స్టెప్ వేయాలని ఉంది అప్పుడు గౌతమ్ వెయ్యండి అంకుల్ మీకు అడ్డు ఏముంది కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకుందామా అంటే దానికి మహేంద్ర ఒకటి కాదు రెండు కేకులు కట్ చేద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ పంచి పెడదాం అని అనుకుంటూ ఉండగా అక్కడకు రిషి వసూలు ఎంట్రీ ఇస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.