green apple: సీజన్లను బట్టి పండ్లు ఏవైనా ఆరోగ్యానికి మంచిదే. వాటిలో ఆపిల్ అగ్రస్థానంలో ఉంటుంది. రోజూ ఒక యాపిల్ తింటే అది మిమ్మల్ని రోగాల నుంచి దూరం ఉంచుతుంది అని డాక్టర్లు చెబుతుంటారు. మనకు ఎర్ర యాపిల్స్ తెలుసు. అలాగే గ్రీన్ యాపిల్స్ తినడం కూడా ఇటీవల బాగా పెరిగింది. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ యాపిల్ లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీనివల్ల అదనంగా అందం, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవే కాకుండా అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని మీకోసం..
కాలేయానికి మంచిది : గ్రీన్ యాపిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మీ కాలేయాన్ని హెపాటిక్ పరిస్థితుల నుండి కాపాడుతాయి. గ్రీన్ యాపిల్ కాలేయం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది.
మానసిక ఆరోగ్యం పెరుగుతుంది..
గ్రీన్ యాపిల్ తింటే శరీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. ఇందులో క్వెర్సెటిన్ ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి గ్రీన్ యాపిల్స్ రెగ్యులర్ గా తినడం చాలా మంచిది
ఎముకలను బలోపేతం : బలమైన ఎముకలకు కాల్షియం అవసరం. దీనిలోపం వల్ల ముఖ్యంగా మహిళల ఎముకలు అరిగిపోవడానికి, బలహీనపడటానికి అవకాశం ఉంది. గ్రీన్ ఆపిల్ బోలు ఎముకల(ఆస్టియోపొరోసిస్ ) వ్యాధిని నివారిస్తుంది.
మెరుగైన కంటిచూపు : గ్రీన్ ఆపిల్లో సుసంపన్నమైన విటమిన్ ఎ దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కంటి సంబంధ వ్యాధులు తగ్గుతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది.
green apple:
ఊపిరితిత్తుల రక్షణకి : అధ్యయనాల ప్రకారం,గ్రీన్ ఆపిల్ యొక్క రోజువారీ వినియోగం ఊపిరితిత్తుల ప్రమాదాలను 23% తగ్గిస్తుంది. ఇది ఉబ్బసం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధూమపానం చేసేవారు రోజూ గ్రీన్ ఆపిల్ తినటం మంచిది. అన్నిటికంటే ముందు ధూమపానం వదిలేయడం ఇంకా మంచిది.
బరువు నియంత్రణ:
గ్రీన్ యాపిల్స్‌లో పీచు ఉండటం వలన అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. అలాగే దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది.