Bigg boss 6 : బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో వరుసగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.కావాలని చేస్తున్నారో లేదంటే మరొకటో కానీ మొదట వచ్చే లీకులు వేరు.. తరువాత ఎలిమినేట్ అయ్యేవారు వేరు. అయితే ఫైనల్‌గా అసలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో శనివారమే తెలిసిపోతోందనుకోండి. అయినా కూడా కొన్ని సార్లు బిగ్‌బాస్ నిర్వాహకులు కావాలనే తొలుత రాంగ్ లీక్స్ ఇచ్చేసి ఓ హైప్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. గత వారం గీతూ ఎలిమినేషన్ బిగ్ షాక్.
ఎందుకంటే గీతూ ఏదో తోపు ప్లేయర్ అని కాదు కానీ ఉంటేనే హౌస్‌లో మాంచి కిక్ ఉంటుంది. గొడవలు బీభత్సంగా అవుతాయి.కంటెంట్ బాగానే వస్తుంది. అందుకే గీతూని బిగ్‌బాస్ ఇప్పుడప్పుడే బయటకు పంపించడనే టాక్ నడిచింది. కానీ సీన్ రివర్స్ తొమ్మిదవ వారమే ఆమె షో నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ మధ్య బాలాదిత్య ఓటింగ్ కొంత మేర బాగానే ఉంది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉండి ఉంటే మాత్రం బాలాదిత్య బయటకు వచ్చేవాడు కాదేమో. డబుల్ ఎలిమినేషన్ కాబట్టి మన రేలంగి మామయ్య హౌస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
మరి నేడు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఈ విషయంలోనే బిగ్‌బాస్ నుంచి తొలుత రాంగ్ లీక్స్ వచ్చాయి. బాలాదిత్యతో పాటు మెరీనా ఎలిమినేట్ అయిపోయిందనే లీక్ బయటకు వచ్చింది. దీంతో వెబ్‌సైట్స్ అన్నీ హడావుడిగా మెరీనా ఎలిమినేట్ అంటూ న్యూస్ ఇచ్చేశాయి. ఆ తరువాత కాసేపటికే గ్రేట్ ట్విస్ట్. ఈ వారం ఎలిమినేట్ కాబోయేది మెరీనా కాదు.. వాసంతి అని. నిజానికి వాసంతి ఎలిమినేట్ కాబోతోందన్న న్యూస్ కొన్ని వారాలుగా వస్తూనే ఉంది. అందరికంటే ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉంటోంది. ఏదో ఆమె ఎలిమినేషన్ తృటిలో తప్పి పోతోంది. ఈ వారం మాత్రం ఆమె బయటకు రాక తప్పలేదు.