Grapes Benefits : పండ్లు అనగానే మనకు గుర్తుకువచ్చే కొన్నింటిలో ద్రాక్ష కూడా ఉంటుంది. సైజులో చిన్నగా, రుచికి ఎంతో తీయగా, పుల్లగా భలే అనిపిస్తుంటుంది. అయితే ద్రాక్షలో ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా నల్లద్రాక్షలో అయితే విటమిన్ A, C, B6లతో పాటు గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని బాగా కాపాడతాయి. అందుకే ద్రాక్ష తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కింద తెలుసుకోండి.
బరువు తగ్గుతారు:
ద్రాక్షను రెగ్యులర్ గా తినే వారు బరువు తగ్గుతారు. ద్రాక్ష తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది.
గుండె సమస్యలకు చెక్:
నల్లద్రాక్ష తినడం వల్ల అందులోని ఫైటో కెమికల్స్ గుండెను రక్షిస్తాయి. గుండెలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేస్తుంది. దీని వల్ల కొలెస్ట్రాల్ తగ్గి కండరాలకు మేలు కలుగుతుంది. గుండె సమస్యలను నివారించాలనుకునే వారు నల్లద్రాక్షను రెగ్యులర్ గా తీసుకుంటే సరిపోతుంది.
Grapes Benefits : క్యాన్సర్ నుండి రక్షణ:
నల్ల ద్రాక్షలోని పోషకాలు, విటమిన్స్ కాన్సర్ కారకాలతో పోరాడుతాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే కాన్సర్ వంటి సమ్యలు రావు.
జ్ఞాపకశక్తి మెరుగు:
చాలామందికి మరిచిపోయే గుణం ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు నల్లద్రాక్ష తినడం వల్ల మేలు కలుగుతుంది. అలాగే మైగ్రేన్ తో బాధపడే వారికి కూడా ఉపశమనం కలుగుతుంది.