Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ లో బ్లడ్ డొనేటింగ్ కార్యక్రమం గురించి సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎంతోమంది ఆపదలో ఉన్న వారికి మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ సహాయం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తమిళ సై ఎంతో గొప్పగా తెలియజేశారు.
ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ గురించి బ్లడ్ ప్రాముఖ్యత గురించి వివరించిన ఈమె ఒక చుక్క రక్తం కూడా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు. ఒక 10 ఎంఎల్ రక్తం అప్పుడే పుట్టిన శిశువుకు ప్రాణాలను నిలబెడుతుంది ఇలా మనం ఎంత రక్తం ఇచ్చినాము అనేది కాకుండా మనం ఇచ్చిన ప్రతి రక్తపుబొట్టు ఎంతో విలువైనదని ఈమె వెల్లడించారు. మనం తరచూ రక్తం దానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి పాతరక్తం వెళ్లిపోయి మన శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.
Governor Tamilisai: మెగాస్టార్ ఎంతోమందికి స్ఫూర్తి…
ఇక మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ తనపై ప్రశంసలు కురిపించారు. ఇలా అయన బ్లడ్ బ్యాంక్ పెట్టడం వల్ల ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఈయనని చూసి మిగతా హీరోలు కూడా ఇన్స్పైర్ కావాలని, ఇతర హీరోలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని ఆమె వెల్లడించారు. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు అని చెప్పుకుంటున్నారు. అలా స్టార్ హీరోలు అందరూ కూడా చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అవ్వాలని తమిళ సై వెల్లడించారు.