Gooseberry: మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఉసిరి కాయ దోహదపడుతుంది. సాధారణంగా వచ్చే జలుబు, బ్యాక్టీరియాలను నివారించడానికి ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉసిరి జ్యూస్ కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. చర్మ సౌందర్యం కోసం కూడా ఉపయోగిస్తారు. కంటిచూపును కూడా మెరుగుపరిచే శక్తి ఉసిరికి ఉంది.
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే ఏమవుతుందో తెలుసా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని రుజువైంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగితే జీర్ణ సంబంధ రోగాలు దరిచేరవు. అధిక బరువుతో బాధపడేవారు కూడా ఉసిరి రసం తాగితే ఉపశమనం లభిస్తుంది. మంచి శరీరాకృతి వస్తుంది. అజీర్తిని నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి.
ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలోని టాక్సిన్స్ తొలగిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లను తొలగించడానికి కూడా ఉసిరిని బెస్ట్ మెడిసిన్ గా వాడతారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడే వారు ఉసిరి రసాన్ని ప్రయత్నించొచ్చు. కంటి సమస్యలను దూరం చేసుకోవడానికి ఉసిరి చక్కటి పరిష్కారం.
Gooseberry:
దీంతోపాటు జామకాయ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటి చూపు మరింత మెరుగు పడుతుంది. రోజుకో గ్లాసు ఉసిరి రసం తీసుకుంటే అనేక రోగాలు రాకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి జ్యూస్ తో కంటి శుక్లం సమస్యలు దూరమవుతాయి. చికాకు, డ్రై ఐస్ లాంటి సమస్యల్ని నయం చేస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటు శరీరానికి శక్తి కూడా చేకూరుతుంది. దీన్ని ఎనర్జీ డ్రింక్ గా కూడా పిలుస్తారు.