మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి పేకేఆర్ చనిపోవడం, బ్రహ్మ పాత్రలో చిరంజీవి ఎంట్రీ హైలైట్ గా నిలిచింది. ఇక తరువాత చిరంజీవిని వ్యతిరేకించే పాత్రలో నయనతార, ఆమె భర్తతో రాజకీయాలని శాశించాలనుకునే వ్యక్తిగా సత్యదేవ్ పాత్రని పరిచయం చేశారు.
నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుంచి దూరంగా లేదు అనే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేస్తుంది. రాజకేయాలని శాశించి గాడ్ ఫాదర్ గా చిరంజీవి పాత్ర ఉంటుందని అర్ధమవుతుంది. చిరంజీవి, సత్యదేవ్ మధ్య వచ్చే డైలాగ్ వార్ కూడా హైలైట్ గా ఉంది. చిరంజీవి అంగ రక్షకుడుగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ లో సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది. అనే విషయాన్ని, అలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలన్నింటిని పరిచయం చేసేసారు. ఇప్పటికే లూసిఫర్ సినిమాని అందరూ చూసేసి ఉండటంతో ఈ ట్రైలర్ లో ఏదీ దాటకుండా డైరెక్టర్ మోహన్ రాజా గాడ్ ఫాదర్ రెండు గంటల సినిమా ఎలా ఉండబోతుంది చెప్పేసాడు.
సినిమా అంతా మెగా మానియా, సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఫన్, సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ తోనే ఆడియన్స్ థియేటర్స్ కి రావాలని ట్రైలర్ బట్టి అర్ధమవుతుంది. ఇక సినిమాలో పాత్రల ఎలివేషన్ కి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ బట్టి ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత ఆ పీఠం కోసం జరిగే రాజకీయ చదరంగం తరహాలో ఈ సినిమా కథ ఉండబోతుంది అని అర్ధమవుతుంది. ఈ కథ ఏపీ రాజకీయ పరిస్థితులకి కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పాలి. అందుకే అనంతరపురంలో చిరంజీవి ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాడేమో అనిపిస్తుంది. యుట్యూబ్ లో ట్రైలర్ లో మంచి స్పందన వస్తుంది. కొంత మంది లూసీఫర్ తో పోల్చి చూసే ప్రయత్నం చేస్తున్న మెగాస్టార్ గ్రెస్, ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో ఈ సినిమా నెక్స్ట్ ట్రైలర్ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు.