Godfather Movie Review: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దసరా కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైన సినిమా ‘గాడ్‌ఫాదర్’. పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. కొణిదల సురేఖ సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ” లూసిఫర్ ” గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించి తెలుగులో కూడా డబ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలుగులో డబ్ అయినప్పటికీ మన నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేసి… ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు.
దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఇటీవల ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పలు డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ చేస్తుండగా ఇప్పటికే ప్రీమియర్ షో లు కూడా పూర్తి అయ్యాయి. ఇటీవల కాలంలో తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు నార్త్ లో కూడా ప్రేక్షకుల ఆదరణలను ఫుల్ గా పొందాయి. పెద్ద సినిమాలైన బాహుబలి, పుష్ప వంటి చిత్రాలే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను కూడా సూపర్ హిట్ గా నిలబెడతారు అనడానికి కార్తికేయ – 2 ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలో సల్మాన్ భాయ్ కూడా ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండడంతో బాలీవుడ్ లో సైతం ఈ మూవీకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

Godfather Movie Review: మెగాస్టార్ డైలాగ్స్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా ..
ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనుండగా నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించారు. ఈ మేరకు ప్రీమియర్ షో లు చూసిన ప్రేక్షకులంతా ” గాడ్ ఫాదర్ ” చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మెగాస్టార్ డైలాగ్స్ కి నార్త్ ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారని తెలుస్తుంది. ఈ మేరకు హిందీలో ప్రీమియర్ షో ముగిసిన తర్వాత మీడియా తో పలువురు ప్రేక్షకులు మాట్లాడుతూ మెగాస్టార్ యాక్టింగ్ , మూవీ మేకింగ్ కి ఫిదా అయినట్లు తెలిపారు. ఈ దెబ్బతో బాలీవుడ్ లో మన మెగాస్టార్ కి ఫుల్ క్రేజ్ పెరిగిందని అర్దం అవుతుంది.