GodFather: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మళయాల మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీపై ఓ యువ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ అందరికీ సుపరిచితుడే. తనదైన కామెడీ శైలితో జాతి రత్నాలు సినిమాను ఈ తరం యువతకు నచ్చేటట్లుగా తీసి అందరి ప్రశంసలూ అందుకున్నాడు.
ఇండస్ట్రీలోని యువ దర్శకుల్లో మంచి కామెడీ టైమింగ్ కలిగిన వ్యక్తిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నాడు. తనతొలి సినిమా పిట్ట గోడతో సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుదీప్.. రెండో సినిమా జాతి రత్నాలు తీసి మంచి విజయం సాధించాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా కామెడీ సెన్సాఫ్ హ్యూమర్ పండిస్తుంటాడు అనుదీప్. తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు.
తాజాగా గాడ్ ఫాదర్ సినిమాపై డైరెక్టర్ అనుదీప్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అనుదీప్ డైరెక్షన్‌లో ప్రిన్స్ అనే మూవీ తెరకెక్కుతోంది. శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఉక్రెయిన్ దేశానికి చెందిన నటి మరియా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
GodFather:
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ అనుదీప్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ సినిమా గురించి ప్రస్తావన తెచ్చాడు. అందరూ గాడ్ ఫాదర్ చూడలేదంటే చాలా విచిత్రంగా చూశారు.. కాస్త ఆలస్యంగా ఆ సినిమా చూశా.. మూవ పెద్ద ఇంట్రస్టింగ్ గా ఏమీ లేదు.. చాలా బోర్ కొట్టింది.. అంటూ అనుదీప్ వ్యాఖ్యానించాడు. దీంతో యాంకర్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారని అడగ్గా… అనుదీప్ వెంటనే తాను హాలీవుడ్ గాడ్ ఫాదర్ మూవీ గురించి చెప్పానంటూ సరదాగా ఫన్ క్రియేట్ చేశాడు.