GodFather:తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. ఆయన దాదాపు 150 కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు.తెలుగు తెరపై తిరుగులేని రారాజుగా పేరు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల పరంగా ఎప్పుడో సెంచరీ కొట్టేసిన మెగాస్టార్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూకుడుగా అడుగులేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో, నయనతార, సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రలలో నటించిన సూపర్ పొలిటికల్ యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్. ఈ సినిమాను మోహన్ రాజా తనదైన స్టైల్ లో తెలుగులో రీమేక్ చేశాడు.ఈ సినిమా దేశవ్యాప్తంగా అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమా రన్ అవుతున్న థియేటర్లో సల్మాన్ ఖాన్ అభిమానులు కాస్త ఓవరాక్షన్ చేశారు. థియేటర్లో గాడ్ ఫాదర్ సినిమాలోని తార్ మార్ పాట హలో సల్మాన్ ఖాన్, చిరంజీవి ఇద్దరు కనిపించినప్పుడు హార్డ్ కోర్ అభిమానులు థియేటర్లో టపాసులు కాల్చారు. దీనితో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనను కొంతమంది ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
GodFather: ఇలా చేయడం మంచిది కాదన్నా సల్మాన్ ఖాన్..
ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ రా మామ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇదే కాకుండా గతంలో సల్మాన్ ఖాన్ నటించిన అంతిమ్ సినిమాకి కూడా అభిమానులు ఇలానే చేశారు. ఈ విషయం జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ వెంటనే స్పందించి ఇలాంటివి చేయడం మంచిది కాదని అభిమానులకు చెప్పాడు. కానీ గాడ్ ఫాదర్ విషయంలో అభిమానులు ఎవరి మాట వినేలాగా లేరు.