తెలుగు సినిమాలలో టైటిల్ సాంగ్ లేదంటే హీరో క్యారెక్టర్ ఎలివేషన్ సాంగ్ ఈ మధ్య కాలంలో సాధారణం అయిపొయింది. కమర్షియల్ జోనర్ లో తెరకెక్కే పెద్ద హీరోల చిత్రాలకి దర్శకులు ఈ పద్ధతిని వాడుతూ ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అలాగే భీమ్లా నాయక్ సినిమాలో భాగా పాపులర్ అయ్యింది. కేజీఎఫ్ లో కూడా రాకీభాయ్ ఎలివేషన్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమాలో ఎలివేషన్ మోంటేజ్ సాంగ్ సర్వ సాధారణం. హీరో గొప్పతనం, వీరోచితం, ధీరత్వం గురించి చెప్పడానికి దర్శకులు ఈ ఎలివేషన్ సాంగ్స్, టైటిల్ సాంగ్స్ ఎంచుకుంటారు.
ఇక తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విస్వరూపదారి, చక్రధారి అనే పదాలతో ఈ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రతి చరణం, పల్లవిలో క్యారెక్టర్ ఇంటెన్షన్, ఆలోచనలని రిప్రజెంట్ చేస్తూ సాంగ్ సాగింది. ఇక తమన్ ఈ సాంగ్ కోసం అందించిన మ్యూజిక్ కూడా మరో లెవల్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో గుర్తుండిపోయేలా సాంగ్ ఉండాలని ప్రాణం పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. సాంగ్ కోసం మేకింగ్ విజువల్స్ ని ఎక్కువగా యూజ్ చేశారు.
అయితే థియేటర్ లో సరైన ప్లేస్ మెంట్ లో ఈ సాంగ్ పడితే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. ఇక దర్శకుడు మోహన్ రాజా తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. లూసీఫర్ కి, దీనికి చాలా మార్పులు ఉంటాయని చెప్పాడు. మాతృకలో మోహన్ లాల్ కేవలం 50 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తాడు. అయితే గాడ్ ఫాదర్ బ్రహ్మ క్యారెక్టర్ రెండు గంటలకి పైగా కథలో ట్రావెల్ చేస్తుంది. కథనం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. దీనిని బట్టి గాడ్ ఫాదర్ లో ఎలాంటి మార్పులు చేసామో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ లా సినిమా కచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాడు.