మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ బాషలలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కిన సినిమా అనే సంగతి అందరికి తెలిసిందే. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని కొణెదల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాయి. ఇక ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించడంతో హిందీ ఆడియన్స్ కి రీచ్ అవుతుందని అక్కడ రిలీజ్ చేస్తున్నారు.
ఇక నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఇప్పుడు మలయాళంలో కూడా డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్టర్ ద్వారా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటికే మలయాళంలో వచ్చిన ఒరిజినల్ సినిమాని రీమేక్ చేసి తెలుగులో తెరకెక్కించారు.
మళ్ళీ అదే సినిమాని డబ్బింగ్ చేసి మలయాళంలో రిలీజ్ చేయడంలో ఆంతర్యం ఏమిటి అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎంత మెగాస్టార్ ఫేమ్ ఉన్న కూడా ఇలా మలయాళంలో హిట్ అయ్యి తెలుగులో డబ్బింగ్ అయ్యి ఓటీటీలో అందుబాటులో ఉన్న లూసీఫర్ రీమేక్ అయిన తెలుగు గాడ్ ఫాదర్ సినిమాని మలయాళంలో డబ్ చేసి వదలడంతో ఇప్పుడు ఈ మూవీపై ట్విట్టర్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నారో కానీ మీమ్స్ చేసుకునే వారికి ఇప్పుడు గాడ్ ఫాదర్ ఫుల్ మీల్స్ ఇచ్చినట్లు అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.