RRR మూవీ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు , ఆహార విషయాల్లో కొన్ని నియమాలు ఉన్నాయని , అవి ప్రతిఒక్కరికి అవసరమేనని చెప్పారు . అలాగే తను డైలీ చేసే దినచర్య లో భాగంగా ఏమేమి డైట్స్ తను తీసుకుంటారో చెప్పుకొచ్చారు .
ప్రతి రోజు ఉదయం జిమ్ లో తన వర్క్ అవుట్ ముగించుకొని బ్రేక్ ఫాస్ట్ లో మూడు బొయిల్డ్ ఎగ్స్ ,రెండు ఎగ్ వైట్ , ఆల్మండ్ మిల్క్ ఒక అర కప్పు ఓట్స్ తీసుకుంటానని ,తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో బ్లాక్ టీ లేదా కాఫీ తాగుతారు. కొద్దిసేపటి తర్వాత వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్ లో బ్రౌన్ రైస్ , పప్పు, అప్పడం, పెరుగు తో తింటారు. పెరుగు తినకుండా లంచ్ పూర్తి చెయ్యరు చరణ్.

నాన్ వెజ్ అయితే చికెన్ ఫ్రై లేదా ఫిష్ ఫ్రై తీసుకుంటారు. హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు చరణ్. సాయంత్రం పూట స్నాక్స్ గా ఉడక బెట్టిన కూరగాయలు, స్వీట్ పొటాటో తింటారు. రాత్రి 6 గంటలకే డిన్నర్ పూర్తి చేసుకుంటారు చెర్రీ డిన్నర్ లో
ఒక బౌల్ నట్స్ గ్రీన్ సలాడ్ అవకడ తీసుకుంటారు. రెస్టారంట్ ఫుడ్ కంటే ఇంటి ఫుడ్ ఇష్టపుతున్నారు చరణ్. ఈ మాత్రం డైట్స్ లేనిదే ఫుల్ ఫుల్ ఫిట్ బాడీ రావడం కష్టమని చెర్రీ చెప్పుకొచ్చారు .