గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ప్రొడక్షన్ బ్యానర్ ‘వి మెగా పిక్చర్స్’ని ప్రారంభించడం ద్వారా తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన అడుగు వేశాడు. UV క్రియేషన్స్‌కి చెందిన తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనేది ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మరియు ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బ్లాస్టర్ మూవీ తీసిన నిర్మాణ సంస్థ.
‘ది ఇండియా హౌస్’ అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇది చారిత్రాత్మక సినిమా అని పేర్కొనటానికి ప్రధాన కారణం. ఈ సినిమాను స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ప్రకటించారు. ఆయన జీవితంలో ఓ కీలకమైన భాగాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు టీమ్ వీడియోలో తెలియజేసింది. ఇందులో అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్‌లోని విక్రమ్‌తో కలిసి రామ్ చరణ్ వీ మెగా పిక్చర్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి ‘ది ఇండియా హౌస్’ మూవీని తెరకెక్కించబోతున్నారు. 1905 సంవత్సరంలో బ్రిటన్ రాజధాని లండన్‌లో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
స్వాతంత్య్ర ఉద్యమానికి ఆజ్యం పోసిన ఘటనల సమాహారంగా ఈ మూవీ రూపొందనుంది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివరాలను ప్రకటించనున్నారు. మరి భవిష్యత్తులో వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ కలిసి ఎలాంటి సినిమాలు నిర్మంచబోతున్నారో చూడాలి.