వెస్టర్న్ కల్చర్ కు బాగా అలవాటు పడ్డ నేటి తరం యువత చాలామంది సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు.వీరిలో ముఖ్యంగా అమ్మాయిలు అసలు పెళ్లి చేసుకోవడానికి సుముఖత చూపట్లేదు ఒకవేళ అమ్మ,నాన్నల బలవంతం మీద అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వారు గర్భవతులు అవ్వడానికి సిద్ధంగా లేరని సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను పొందాలని భావిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి.
ఈ విధానం భారతీయ సమాజాన్ని సంస్కృతిని నాశనం చేస్తుంది కావున యువత తమ విధానాన్ని మార్చుకోవాలని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ అన్నారు.