Ginna: మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా. ఈ చిత్రం తాజాగా విడుదలైంది. అయితే, తరచూ కాంట్రవర్సీల్లో భాగమయ్యే మంచు విష్ణు.. ఈ చిత్రం విడుదల తర్వాత రివ్యూల విషయంలోనూ వెరైటీగా స్పందించారు. తన చిత్రంపై కొందరు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారని మండిపడ్డాడు విష్ణు. నెగిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇటీవల మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాక, అంతకు ముందు కూడా మంచు ఫ్యామిలీపై ట్రోలర్స్ ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. దీనిపై నేరుగా మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా అనేక సందర్భాల్లో స్పందించారు. తమ కుటుంబంపై కొందరు వ్యక్తులు ఆఫీస్ పెట్టుకొని మరీ ట్రోల్స్ కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, ఐపీ అడ్రస్ లతో సహా ఫిర్యాదు చేయడానికి రెడీగా ఉన్నట్లు చాలా సార్లు చెప్పారు.
హిందీ, తమిళంలోనూ రిలీజ్..
ఇక జిన్నా సినిమా విషయానికొస్తే.. సొంత బ్యానర్లోనే ఈ చిత్రాన్ని రూపొందించారు విష్ణు. చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాపై నమ్మకంతో హిందీ, తమిళం, మలయాళంలోనూ విడుదల చేసింది చిత్ర బృందం. అక్టోబర్ 21న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజైంది. కాగా, కొందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారంటూ విష్ణు ఫైర్ అయ్యారు.
Ginna:
అలాంటి వారందరికీ విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విడుదలకు ముందే జిన్నా సినిమాపై నెగిటివ్ టాక్ ఇచ్చిన యూట్యూబ్ ఛానళ్ల పేర్లు, లింకులు షేర్ చేస్తూ మండిపడ్డారు. తనపై ఎందుకింత ద్వేషమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొని మూసివేయించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు మంచు విష్ణు. పాయల్ రాజ్ పుత్ కూడా దీన్ని రీట్వీట్ చేసింది. సినిమా కోసం చాలా కష్టపడ్డామని, దయచేసి ఇలా చేయకండని కోరింది.