Ginger: మనం పెద్దలు ఏం చెప్పినా పట్టించుకోము. వాళ్లు చెప్పిన వాటిని పెడచెవిన పెడుతూ ఉంటాము. కానీ వాళ్ళు ఎలాంటి పరిశోధనలు చేయకుండానే కేవలం వారికున్న అనుభవంతో చెప్పేస్తుంటారు. కానీ వాళ్ళు అప్పట్లో తిన్న ఆహారం వల్లే ఇప్పటికీ ఎంతో బలంగా ఉన్నారనేది నిజం. ఇంకా మన పెద్ద వారికి ఒకప్పుడు హలోపతి మందులు అంటేనే ఏమిటో తెలియదు. కేవలం చెట్ల మందులతోనే కొన్ని రోగాలను తగ్గించుకునే వారు. అలా వారు అల్లం గురించి కూడా కొన్నిటిని ప్రతిపాదించారు. అలా అల్లం కి సంబందించిన బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక అల్లం గురించి తెలుసుకోవాలంటే మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం. కూరల్లో మరియు ఈ మధ్య కాలంలో అల్లంతో టీని చేసుకోని తాగడం మొదలుపెట్టారు. ఇలా తాగితే ఖచ్చితంగా తలనొప్పి నుంచి ఉపశమనం కల్గుతుంది. కానీ కొందరికి అసలు అల్లం అంటేనే చిరాకు పుడుతూ ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి అలా చేయకండి. అల్లాన్ని అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలిసి వస్తుంది.
అల్లం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో వర్కౌట్స్ చేయడం అనేది కామన్ అయిపోయింది. కానీ చేసిన తర్వాత కండరాల నొప్పులతో భాద పడుతూ ఉంటారు. ఇలాంటి కండరాల నొప్పులకు అల్లం మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. అల్లం బాడీలో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. శరీర బరువును తగ్గించడంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది.
Ginger:
రక్త పోటుని అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. నోటి దుర్వాసన మరియు దంత సమస్యలతో బాధ పడుతున్న వారికి అల్లం మేలు చేస్తుంది. కడుపులో మంటని తగ్గిస్తుంది. వికారంతో బాధ పడుతున్న వారు టీ లో అల్లం వేసుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అల్లాన్ని ఆహారంలో వాడితే కడుపు ఉబ్బరం మరియు అజీర్ణ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.