Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం జరిగిన ఎపిసోడ్ లో చాలామంది ఇంటి సభ్యులకు నాగార్జున క్లాస్ తీసుకోవడం జరిగింది. అందరికంటే ఎక్కువగా గీతు రాయల్ కి గట్టిగా డోస్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతున్న విధానం.. తోటి ఇంటి సభ్యులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల కొద్దిగా సీరియస్ కావడం జరిగింది. ఈ క్రమంలో తనకి తిక్క ఉందని… అందువల్లే ఎక్కువగా గొడవలు అవుతున్నాయని గీతు రాయల్ మధ్యలో మాట్లాడింది.
దీంతో నాగార్జున… గీతు కామెంట్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నువ్వు తిక్కల దానివి అని… ఒప్పేసుకుంటే రానున్న రోజుల్లో ఈ తిక్కలది హౌస్ లో ఉండకూడదు.. అని జనాలే బయటికి పంపించేస్తారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో మీతో ఇంకా బిగ్ బాస్ తో కూడా గొడవ జరగొచ్చు సార్ అని గీతు రాయల్.. నాగార్జున పై కామెంట్లు చేసింది. దీంతో నాగార్జున నాతో గొడవపడిన పర్వాలేదు గానీ బిగ్ బాస్ తో గొడవ పడొద్దు.
ఎందుకంటే ఆయనకి కోపం వస్తే ఎప్పుడైనా పంపించేస్తారు. దానికి గీతు నేను అన్నిటికి ప్రిపేర్ అయిపోయా సార్. బిగ్ బాస్ ఏదో ఒక రోజు రెడ్ కార్డ్ ఇచ్చి నన్ను బయటికి పంపించేస్తారు. ఈ క్రమంలో గేమ్ పరంగా అంతా బానే ఉన్న… మాట తీరు బాగోలేదని అది కొద్దిగా సరి చేసుకుంటే బాగుంటుంది అని నాగార్జున..గీతుకి సలహా ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా శనివారం జరిగిన ఎపిసోడ్ లో గీతు రాయల్.. చేసిన వ్యాఖ్యలు చాలా హైలైట్ అయ్యాయి.