BIGG BOSS: తెలుగు టెలివిజన్ స్క్రీన్ మీద కామెడీతో సందడి చేసి బిగ్ బాస్ హౌస్ లో అవకాశాన్ని సంపాదించుకుంది గీతూ రాయల్. తనదైన రాయలసీమ యాసతో బిగ్ బాస్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. మొదటి రెండు వారాల పాటు గీతూ చేసిన ప్రదర్శనని అందరూ ఓవరాక్షన్ అనుకున్నారు. కానీ నాగార్జున ఈ సీజన్ లో గీతూకి ఎక్కువ మార్కులు వేసి పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో మరింత రెట్టింపుతో గీతూ దూకుడు పెంచింది.
ఏ విషయంలో వెనక్కు తగ్గకుండా అన్ని టాస్కులను ఢీకొడుతోంది. ఇక నామినేషన్ల సమయంలో గీతూ వాదన మామూలు గా ఉండదులేండి..! ఈ క్రమంలో గురువారం జరిగిన ఎపిసోడ్ లో గీతూ దూకుడుకు చంటి బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో తనకు వచ్చిన అవకాశంతో గీతూని కెప్టెన్ పోటీ నుండి తొలగిస్తాడు చంటి. దీంతో వారిద్దరి మధ్య చాలాసేపు గొడవ సాగుతోంది.

గతంలో కూడా చాలా సార్లు గీతూ తోటి కంటెస్టెంట్స్ తో పడిన గొడవల క్రమంలో దొబ్బేయ్ అంటూ బూతులు వాడింది. ఇక తాజాగా మరోసారి గీతూ తన నోటికి పని చెప్పింది. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడుతున్న అర్జున్ ను ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న ఆదిరెడ్డి తొలగిస్తాడు. ఇందుకు ఆదిరెడ్డి కారణం కూడా చెప్తాడు. అర్జున్ ఇంకా తన ఆట తీరు ప్రదర్శన మెరుగు పరుచుకోవాలని సూచిస్తాడు.
కెప్టెన్ అయ్యేందుక పోటీ పడిన వారిని తొలగించేందుకు ఆదిరెడ్డి ప్రయత్నించిన తీరును గీతూ తప్పుబడుతుంది. నీవు ముందుగా వెళ్లి ఎందుకు అర్జున్ ను కెప్టెన్ పోటీ నుండి తొలగించావు. మిగతా వారు అందరూ వారి అభిప్రాయం చెప్పిన తర్వాత వెళ్లాల్సింది.. నీవు నీ బొచ్చులో స్టార్టజీ అని గీతూ మరోసారి బూతు పదాలు వాడుతోంది. ఇలా పలు సందర్భాల్లో గీతూ కాస్త నోటీ దురుసును ప్రదర్శిస్తున్న తీరును పలువురు విమర్శిస్తున్నారు. తోటి కంటెస్టెంట్స్ కి కూడా అది కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కాస్త గీతూ నోటి తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.