BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మూడు వారాల పాటు సాగిన ఎపిసోడ్స్ లో ఎక్కవగా కంటెంట్ ఇచ్చింది ఎవరు అంటే ఎలాంటి సందేహం లేకుండా గీతూ అనే చెప్పవచ్చు. సీజన్ మొదటి రోజుల్లో గీతూ ప్రదర్శన కాస్త ఓవర్ అనిపించినా ఆ తర్వాత అది వినోదంగా మారిపోయింది. రోజు రోజుకి హౌస్ లో రెచ్చిపోయిన గీతూకి రెండో వారంలో హోస్ట్ నాగార్జున పాజిటీవ్ గా రెస్పాండ్ అయ్యాడు.
ఇక బ్రేకులు లేని బుల్లెట్ బండిలా మూడో వారంలో గీతూ దూసుకు వెళ్లింది. కావాల్సినంత కంటెంట్ ఇస్తూ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఈ క్రమంలో ఓ టాస్క్ లో భాగంగా ఇనయకు, శ్రీహాన్ కు మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. వారిద్దరి మధ్యలో గీతూ దూరి రచ్చ రచ్చ చేసింది. రచ్చ చేయడమే కాకుండా నాకు నోటి దూల ఉందా అంటూ తోటి కంటెస్టెంట్స్ దగ్గర అభిప్రాయ సేకరణ చేసిన గీతూకి శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున చిన్న ఝలక్ ఇచ్చాడు.ఇనయను ఉద్దేశించి శ్రీహాన్ పిట్ట అనే విషయంపైన వారిద్దరికీ గొడవ స్టార్ట్ అవుతుంది.

ఇందులో శ్రీహాన్ కి మద్దతుగా ఇనయపైన రివేంజ్ ప్లాన్ చేసుకున్న గీతూ మధ్యలో కలుగజేసుకుంటుంది. శ్రీహాన్ పిట్ట అన్నది నన్నే అంటూ గోల గోల చేస్తుంది. పిట్ట అంటే నాలాంటి అందమైన అమ్మాయిలకు వాడతారు నీలాంటి వాళ్లకు కాదు అంటూ కామెడీ చేస్తోంది. మరి అనవసరంగా ఇలా మధ్యలో దూరి అరిచే వాళ్లను ఏమంటారో తెలుసా అంటూ నాగార్జున కంటెస్టెంట్స్ ని అడుగుతాడు. దీన్నే నోటి దూల అంటారు అంటూ గీతూకు తనదైన శైలిలో పంచ్ వేస్తాడు నాగార్జున.
శ్రీహాన్ ఆ సందర్భంలో ఇనయను ఉద్దేశించే మాట్లాడినప్పుడు నీవు ఎలా మధ్యలో ఎంటర్ అవుతావంటూ గీతూని ప్రశ్నిస్తాడు నాగార్జున. దీంతో ఒక్కసారిగా దూకుడు మీద ఉన్న గీతూ మొఖం చిన్నబోతుంది. ఆ తర్వాత మరలా గీతూ ఆటతీరును మాత్రం నాగార్జున మెచ్చుకుంటారు. మాట తీరు మార్చుకోమని చెబుతాడు. మరి నాగార్జున సూచన మేరకు గీతూకు దూకుడుకు బ్రేక్ పడుతుందా.. ఎప్పటిలాగే తనదైనా శైలిలో దూసుకుపోతుందా చూడాలి…!