Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు గత వారం నుంచి రసవత్తరంగా మారింది. ఫుల్ జోష్‌తో నడుస్తోంది. నోరు విప్పకుంటే ఇక ప్రాబ్లమ్ అవుతుందని అనుకున్నారో ఏమో కానీ ఎవరూ తగ్గట్లే. నిన్న మొన్నటి వరకూ కూల్ అండ్ కామ్ గోయింగ్‌గా ఉన్న రోహిత్ సైతం నిన్న నామినేషన్స్‌లో గట్టిగానే మాట్లాడాడు. ఎంత గట్టిగా అంటే ఇంటి మొత్తాన్ని తన చెత్త ఆర్గ్యుమెంట్‌తో నోరు మూయించే గీతూ నోరు మూయించేంత గట్టిగా మాట్లాడాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గీతూ హౌస్‌లో నీతులు వల్లిస్తోంది.
నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ ఎదుట ఉన్న దిష్టిబొమ్మలపై కుండలు పగలగొట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా వచ్చిన గీతూ.. నీ భర్తతో కలిసి ఆడుతున్నావని.. చేపల టాస్క్‌లో మెరీనా చేపలను రోహిత్ ప్రొటెక్ట్ చేశాడని హోస్ట్ నాగార్జున అన్న విషయాన్ని గుర్తు చేస్తూ రోహిత్ నామినేట్ చేసింది. పైగా రోహిత్ ఒక కన్‌ఫ్యూజన్ పర్సన్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలోనే భర్త సపోర్ట్‌తో ఆడుతోందంటూ మెరీనాను సైతం నామినేట్ చేసింది గీతూ. నిజానికి వీరిద్దరూ ఎవరి గేమ్ వారు ఆడుకున్నారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నది లేదని నాగ్ ముందే రోహిత్ స్పష్టం చేశాడు.
నిజానికి గీతూ ముందే చేపల టాస్క్‌లో శ్రీహాన్ టీంతో ఒప్పందం కుదుర్చుకుంది. మీ చేపలను ఎవరూ తీసుకెళ్లకుండా మేం కాపాడుతాం. మా చేపల జోలికి ఎవరూ రాకుండా మీరు ప్రొటెక్ట్ చేయండి అని. గీతూ చేసినన పనిని నాగ్ బయట పెట్టలేదు కానీ రోహిత్‌ను మాత్రం నిలదీశారు. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకుని గీతూ నీతులు మొదలు పెట్టేసింది. అయితే రోహిత్ మాత్రం ఊరుకోలేదు. గేమ్‌లో గీతూ మెరీనాతో పాటు తనను పర్సనల్‌గా రెచ్చగొట్టిన విషయాన్ని రోహిత్ చెప్పాడు. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నాకు ఓటేసి ఇప్పుడేమో నా గేమ్ అర్థం కావట్లేదని నామినేట్ చేయడం సిల్లీగా అనిపించిందంటూ గీతూ దిష్టిబొమ్మ కుండ పగలగొట్టాడు. అంతటితో ఆగాడా? గీతూ మాటలకు పాయింట్ టు పాయింట్ మాట్లాడేసి ఆమె నోరు మూయించాడు.