BIGG BOSS: బిగ్ బాస్ రియాలిటీ షో గురించి దాదాపు అందరికీ తెలుసు. సోమవారం నామినేషన్స్ ఉంటాయి. శనివారం, ఆదివారం ఎలిమినేషన్స్ ఉంటాయి. ఈక్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను హౌస్ లో కంటెస్టెంట్స్ వారి ప్రదర్శనను చూపించి పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు ఎలా ఉంటాయంటే హౌస్ లో కంటెస్టెంట్స్ ఒకరికి ఒకరు కొన్నిసార్లు దూరం అయ్యేలా ఉంటాయి. మరికొన్నిసార్లు దగ్గర చేసే విధంగా ఉంటాయి.
ఈ క్రమంలో మూడో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా అడవిలో ఆట అనే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ లో కొందరు పోలీసులు, మరికొందరు దొంగలుగా విడిపోతారు. కంటెస్టెంట్స్ లో ఒకరు అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా హౌస్ లోని గార్డెన్ ఏరియాను అడవిలా మార్చేశారు. ఈ అడివిలో వివిధ విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని కాపాడటం పోలీసుల బాధ్యత. పోలీసులకు చిక్కకుండా వీలైనన్ని ఎక్కువ వస్తువులను అడవి నుండి దొంగిచించి అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలికి అమ్మి వీలైనన్ని ఎక్కువ డబ్బులు సంపాదించడం దొంగల లక్ష్యం.

ఈ టాస్క్ లో అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలుగా గీతూ వ్యవహరిస్తోంది. ఇంకేముంది గీతూ తనదైన శైలిలో టాస్క్ లో రచ్చ రేపుతోంది. తనకు బిగ్ బాస్ విఐపీ యాక్సెస్ కార్డు ఇచ్చారు. దీంతో అందరూ కష్టపడి గార్డెన్ ఏరియాలో గేమ్ ఆడుతుంటే గీతూ ఎలా టాస్క్ లో హైలెట్ అవ్వాలని వీఐపీ ఏరియాలో ప్లాన్స్ వేసుకుంది. టాస్క్ రూల్స్ ప్రకారం అత్యాశ కలిగిన వ్యాపారస్తురాలిగా ఉన్న గీతూ దొంగల నుండి బొమ్మలను కొనలి. కానీ గీతూ వెరైటీగా దొంగల నుండే బొమ్మలను కొట్టేసింది.
దీంతో ఇలా చేయడం రూల్స్ విరుద్దం అంటూ పోలీసుల టీం గీతూతో వారించింది. గీతూ మాత్రం నా ఇష్టం రూల్స్ బుక్ లో నేను దొంగతనం చేయకూడదు అని ఎక్కడా లేదు కదా అంటూ పోలీసులతో వాదించింది. అప్పటికీ పోలీసుల టీం గీతూతో వాదిస్తూనే ఉన్నారు. ఓ సందర్భంలో గీతూ గార్డెన్ ఏరియా, హౌస్ లో తిరుగుతూ ఉంటే పోలీసుల టీం విభేదిస్తారు. కానీ నా ఇష్టం నేను ఎక్కడైనా తిరుగుతా… నా గేమ్ నేను ఆడతా.. ఇందులో తగ్గేదేలా అంటూ సినిమా డైలాగ్ చెబుతూ పోలీసుల టీంకు చుక్కలు చూపించింది.