BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడోవారం కాస్త రంజుగానే స్టార్ట్ అయింది. గడిచిన రెండు వారాల పాటు జరిగిన సీజన్ సిక్స్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఎలాంటి ప్రదర్శన చూపించలేదని బిగ్ బాస్ స్వయంగా ప్రకటన చేశారు. ప్రదర్శన బాగా చేయలేకపోయారనే కారణం చేత హౌస్ లో కంటెస్టెంట్స్ కి ఇవ్వాల్సిన లగ్జరీ బడ్జెన్ ను ఈ వారం బిగ్ బాస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దీంతో కంటెస్టెంట్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.
ఇక సోమవారం జరిగిన నామినేషన్ల ఘట్టం మాటల తూటాలతో సాగింది. కంటెస్టెంట్స్ వారి మనసులో మాటలను నిర్భయంగా బయటపెట్టాలని బిగ్ బాస్ సూచించారు. దీంతో హౌస్ లో నామినేషన్స్ జరుగుతున్న సమయంలో కాసేపు మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలో ఎక్కవగా రెచ్చిపోయింది గీతూ రాయల్ అనే చెప్పవచ్చు. గీతూ రాయల్ ను చంటి, ఇనయ, సుదీప, నేహా చౌదరి నామినేట్ చేయడం జరిగింది.

నామినేషన్స్ జరుగుతున్న సమయంలో ఇనయ సుల్తాన, గీతూకు మధ్య మాటల యుద్దం గట్టిగానే జరిగింది. ఇనయ రెండో వారంలో జరిగిన గేమ్ లో సంచాలకురాలిగా వ్యవహరించిన తీరును గీతూ తప్పబట్టింది. దీనిపై ఇనయ గట్టిగానే గీతుతో వాదించింది. నేను ఎలా ఉంటాను అనేది నా ఇష్టం ఎలిమినేట్ చేశావు కదా ఇక దొబ్బెయ్ అంటూ పెద్ద పెద్ద పదాలను గీతూ వాడటం గమనార్హం.
ఇక ఇదే క్రమంలో చంటితో కూడా గీతూకి పెద్ద వాదనే కొనసాగింది. వారిద్దరూ క్యారెక్టర్లకు సంబంధించి ఒకరిపై ఒకరు వాదోపవాదనలు చేసుకున్నారు. నేను సలహా ఇచ్చినా కూడా నీ తీరు అలాగే ఉందంటూ గీతూపై చంటి కూల్ గా ఫైర్ అయ్యారు. ఇక సుదీప నామినేషన్స్ టైంలో గీతూకి గట్టిగానే క్లాస్ పీకింది. నన్ను రెచ్చగొట్టే విధంగా నీ ప్రవర్తన సాగిందంటూ గీతూపై సుదీప మండిపడింది. అంతలా రెచ్చిపోయేలా మాట్లాడిన గీతూ చివరికి సుదీపకు క్షమాపణ చెప్పడం కొసమెరుపు.